గుండె జబ్బు ఉందని చెప్పినా హింస.. రామోజీ పాపం ఊరికే పోదు జగన్ అంటూ.. నెటిజన్ల ట్రోలింగ్ (వీడియో)
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత సీహెచ్ రామోజీరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గుండె, వృద్దాప్య సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 3.45 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దాంతో తెలుగు పాఠకలోకం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో మీడియాలో ఓ శకం ముగిసిందనే విషయాన్ని బాధతో పంచుకొంటున్నారు.
అయితే ఆయనను వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టిన హింసతోనే ఆరోగ్యం క్షీణించింది. ఆ కారణంగానే ఆయన తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయని పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. అయితే జగన్ పెట్టిన హింస ఇదే అంటూ నెటిజన్లు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మార్గదర్శి చిట్‌ఫండ్, ఇతర కేసుల్లో రామోజీరావును వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా టార్గెట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వారి కుటుంబ పత్రిక సహాయంతో ఆయన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించినా వాటాదారులు, ఖాతాదారులు ఆయన వెంటే ఉన్నారు.
అయితే గత జగన్ ప్రభుత్వం హాయంలో రామోజీరావును ఎక్కువగా టార్గెట్ చేశారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన్ను వదల్లేదు. పోలీస్ అధికారులు నేరుగా ఆయన బెడ్ వద్దకు వెళ్లి దర్యాప్తు పేరుతో ఇంటరాగేషన్ చేశారంటూ నెటిజన్లు వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది.
ఇక వీడియోలో.. నాకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. నేను మీ విచారణకు సహకరించలేను అన్నప్పటికీ.. అధికారులు ఆ చుట్టూ చేరి విచారణ చేపట్టిన విషయం వీడియోలో స్పష్టమైంది. ఈ వీడియోను ఆసరాగా చేసుకొని.. రామోజీరావును ఎలా హింస పెట్టారో చూడండి.. నాకు హార్ట్ ప్లాబ్లెం ఉంది. కనీసం టైమ్ కూడా ఇవ్వకుండా అనడం కనిపించింది. దాంతో వైఎస్ జగన్‌పై నెటిజన్లు విరుచుకుపడుతూ..పాపం ఊరికే పోదు జగన్ అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఆ వీడియో మీరే చూడండి..


Click it and Unblock the Notifications