మెగా, అల్లు వివాదం.. రాంచరణ్ గేమ్ చేంజర్ మూవీకి పోటీగా ఆ సినిమా ప్లాన్?

గత కొన్ని నెలలు కితం తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న పరిణామాలు అంతా చూస్తూనే ఉన్నారు. ఒక పక్క పొలిటికల్ గా ఇంకో పక్క సినిమాల పరంగా కూడా ఓ రేంజ్ లో ఏదొక అంశం హైలైట్ గా నిలుస్తుంది. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో మరింత స్థాయిలో రచ్చ నడుస్తుంది.

దీనితో గత జూన్ నుంచి మొదలైన రచ్చ మధ్యలో కొంచెం చల్లబడింది అనుకున్నారు కానీ మళ్ళీ మొన్ననే అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకి దారి తీశాయి. కాగా మళ్ళీ మొత్తం మొదటికే వచ్చింది. దీనితో ఇప్పుడు సినిమా పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా వర్సెస్ అల్లు అభిమానుల నడుమ పెద్ద యుద్ధమే నడుస్తుంది.

never ending allu and mega controversy allu compound releasing a film on game changer release date

చాలా వరకు ఇప్పుడు అల్లు అర్జున్ మెగా బ్రాండ్ నుంచి వెనక్కి వెళ్లి తన అల్లు బ్రాండ్ ని హైలైట్ చేసుకోవాలని చూస్తున్నాడు అని అందుకే మెగా హీరోస్ ని కూడా టార్గెట్ చేయడం మొదలైంది అని అలాగే మెగా హీరోస్ కూడా కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారని అల్లు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో కానీ అల్లు కాంపౌండ్ మాత్రం మెగాహీరో సినిమాని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది.

మెగా లెగసి క్యారియర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ చిత్రం "గేమ్ చేంజర్" కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని ఫిక్స్ చేసారు.

never ending allu and mega controversy allu compound releasing a film on game changer release date

ఇంకా ఆ డేట్ కూడా డిసెంబర్ 20కి ఫిక్స్ చేశారు అంటూ సినీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది. కానీ సరిగ్గా ఇదే డేట్ లో అల్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తమిళ చిత్రం "విడుదల 2" ని కూడా విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. తమిళ్ లో మంచి హిట్ అయ్యిన ఈ చిత్రం సీక్వెల్ పై కూడా మంచి బజ్ ఉంది. కాగా పార్ట్ 2 ఎప్పుడు నుంచో చూస్తుండగా ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

మరి సరిగ్గా గేమ్ చేంజర్ ని ప్లాన్ చేస్తున్న డేట్ లోనే ఈ సినిమాని తెలుగులో కూడా అనౌన్స్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీనితో ఇది అల్లు ఫ్యామిలీ మెగాని టార్గెట్ చేసినట్టు కాదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఈ సెప్టెంబర్ మొదటి వీక్ లో అలా అనౌన్స్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే డిసెంబర్ 20 డేట్ కి వస్తే అల్లు కాంపౌండ్ అన్నీ తెలిసే రిలీజ్ కి సిద్ధం చేసుకున్నారని అనుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X