సరికొత్త వివాదంలో పుష్ప 2.. లాభాలు పంచుకోవడంపై కోర్టులో కొట్లాట?
పాన్ ఇండియా సినిమా దగ్గర ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకున్న చిత్రాల్లో లేటెస్ట్ గా కొత్త లెక్కలు పరిచయం చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2 ది రూల్ కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమా బాహుబలి, కేజీయఫ్ లాంటి రేంజ్ సీక్వెల్ కి స్కోప్ ఉన్న సినిమాగా కాకుండా వచ్చి మరీ ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.
కాగా ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లు కూడా చాలా ప్రతికూల అంశాల్లో అందుకోవడం అనేది మారాయి హైలైట్ అని చెప్పాలి. కాగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన రోజు నుంచే ఏదొక కాంట్రవర్సీ అలా వస్తూనే ఉందని చెప్పాలి. సినిమా డిసెంబర్ 5 రిలీజ్ అయితే డిసెంబర్ 4 రాత్రి నుంచే మేకర్స్ పైడ్ ప్రీమియర్స్ వేసుకున్నారు. ఆ రోజు నుంచే పుష్ప 2 కి ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి.

తెలంగాణకి చెందిన ఓ కుటుంబంలో ఒక మహిళ మరణించగా ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఆ రోజు నుంచి చాలా అంశాల్లో పుష్ప 2 కి భారీ అడ్డంకులు ఎదురయ్యాయి. అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం నుంచి ఆ తర్వాత సీఎం సహా పలువురు నేతలు కూడా షాకింగ్ కామెంట్స్ చేయడం ఆ తర్వాత సినిమా నిర్మాతలపై వసూళ్ల పరంగా ఐటీ దాడులు ఇలా చాలానే హంగామా నడిచింది.
ఇక మొన్నటికి మొన్న యూసుఫ్ గూడా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ పుష్ప లాంటి సినిమాలు చేయకూడదు అని ఇలాంటి సినిమాలకి సెన్సార్ ఎలా ఓకే చెబుతుంది అని పిల్లలు పాడవుతున్నారు అంటూ ఇలా ఎన్నో రకాలుగా పుష్ప 2 ఒకదాన్ని మించిన మరో కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఇపుడు మరో ఊహించని కాంట్రవర్సీ పుష్ప 2 కి ఎదురైంది.

పుష్ప 2 కి వచ్చిన లాభాల్లో జానపద కళాకారులకి పెన్షన్ గా పంచాలి అంటూ తెలంగాణ హై కోర్ట్ లో పిల్ దాఖలు అయ్యినట్టుగా ఇపుడు ట్విస్ట్ బయటకి వచ్చింది. సుప్రీం కోర్ట్ తీర్మానం ప్రకారం లాభాలు వచ్చినపుడు అవి కళాకారుల సంక్షేమం నిమిత్తం కేటాయించాలి అని లాయర్ నరసింహా రావు పుష్ప 2 విషయంలో వేసిన పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది.
అయితే పుష్ప 2 రన్ పూర్తయ్యినప్పటికీ రిలీజ్ కి ముందు మేకర్స్ తీసుకున్న అదనపు హైక్ లు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఆ హైక్స్ తో చిత్ర యూనిట్ భారీ లాభాలు అందుకున్నారని వాటి నుంచి చిన్న సినిమాలకి, కళాకారులకి పంచిపెట్టాలి అని వారు తెలిపారట. కాగా ఈ కేసు ఇపుడు మరో రెండు వారాలకి వాయిదా పడినట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో ఇలా మొత్తానికి పుష్ప 2 కి మాత్రం ఇపుడు వివాదాలు థియేటర్స్ నుంచి ఓటిటి వరకు వచ్చేసినా కూడా వదిలేలా లేవని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











