RC16: చరణ్ కోసం నిర్మాతలు కీలక నిర్ణయం.. కోట్ల ఖర్చుతో కొత్త ఆఫీస్ ఎవరిదబ్బా!
బడా హీరో కుమారుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రామ్ చరణ్. అలా సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న చరణ్.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనతో ప్రకటించాడు.

బుచ్చిబాబు సనతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసే సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్ 'గేమ్ చేంజర్'ను పూర్తి చేసిన వెంటనే దీన్ని పట్టాలెక్కించేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.
బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి మొదలు కాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, దీన్ని మాత్రం ఈ నెలలోనే అధికారికంగా ప్రారంభిస్తారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమం ఆగస్టు 28న జరగనుందట.
ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం నిర్మాతలు కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త ఆఫీస్‌ను నిర్మించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఓపెనింగ్‌నే ఆగస్టు 28న జరపబోతున్నారట. అయితే, ఇది మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లదా? లేక వృద్ధి సినిమాస్ వాళ్లదా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. కానీ, చరణ్ మూవీ కోసం కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











