twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాధేశ్యామ్ ఖాతాలో మరో రికార్డు.. ఇండియాలోనే తొలిసారిగా !

    |

    'బాహుబలి' సిరీస్‌తో తెలుగులో మరే హీరోకి అందనంత భారీ కలెక్షన్లు సాధించిన యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఈ సిరీస్ తర్వాత ఆయన చేసిన 'సాహో' సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఆ సినిమా కూడా పలు రికార్డులు నెలకొల్పింది. ఇక ప్రభాస్ 20వ సినిమా 'రాధే శ్యామ్' విషయంలో కూడా ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టిన సమయం నుండే రికార్డుల పరంపర మొదలైంది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆ వివరాల్లోకి వెళితే

    ముందు నుంచే రికార్డులు

    ముందు నుంచే రికార్డులు

    'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమా నుంచి ఫ్యాన్స్ కోరినట్లు సరైన అప్డేట్ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. యూనిట్ కి నచ్చినట్టు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటారు. అలా ముందుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అప్పటికే ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తే చాలని భావించి ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ వెంటనే వైరల్ చేశారు. అప్పట్లో ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి రచ్చ చేయడంతో ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    ట్విట్టర్ లో రికార్డ్

    ట్విట్టర్ లో రికార్డ్

    అప్పట్లో ట్విట్టర్‌ లో సింగిల్ హ్యాప్‌ట్యాగ్‌తో 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ 3.8 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్కువ ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అప్పట్లో సినిమా యూనిట్ కూడా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ రాధే శ్యామ్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు.

    తాజా రికార్డు ఏమిటంటే

    తాజా రికార్డు ఏమిటంటే

    అందుకే అలాగే ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ గ్లింప్స్ వీడియో సుమారు 5 లక్షల లైక్స్ సాధించి అలా ఐదు లక్షల లైక్స్ సాధించిన ఫస్ట్ ఎవర్ గ్లింప్స్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బకు ప్రభాస్ ఖాతాలో, అలానే రాధే శ్యామ్ ఖాతాలో కూడా మరో రికార్డు వచ్చి చేరింది.

    Recommended Video

    Prabhas Radhe Shyam బిజినెస్ స్ట్రాటజీ.. Radhe బాటలో ? || Filmibeat Telugu
    విడుదలకు సిద్దం

    విడుదలకు సిద్దం

    పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి ప్రచారం జరుగుతోంది. .

    English summary
    On this Valentine’s Day, at exactly 9:18 AM, the team of Radhe Shyam released the a short video titled a ‘Glimpse Of Radhe Shyam’. A short 53-second video now Set an record by getting 5 lakh likes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X