Year Ender 2023: 2023లో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లు ఎవరో తెలుసా..?

మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2024కు ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అయితే 2023లో చాలా కొత్త కొత్త విషయాలు జరిగాయి. ముఖ్యంగా చాలా మంది కొత్త నటులు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు. హీరోహీరోయిన్లతో పాటు కమెడియన్లు.. ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా వచ్చారు. అయితే 2023వ సంవత్సరం టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. సాక్షి వైద్య:అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది. ఆ తర్వాత గాంధీవధారి అర్జున్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంది.

New Telugu Heroines Introduced in 2023 Check Details

2. నుపుర్ సనన్:మాస్ మాహారాజ రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఫ్లాప్ అవ్వడంతో.. కన్నప్పలో ఛాన్స్ వచ్చిన కాదనుకుని వెళ్లిపోయింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ కృతి సనన్ చెల్లెలు కావడం గమనార్హం.

3. ఆషికా రంగనాథ్:అమిగోస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగలో కూడా నటించిందీ క్యూట్ బ్యూటీ. మరి ఈ చిత్రంతోనైనా హిట్టు కొడుతుందా లేదా అనేది చూడాలి.

New Telugu Heroines Introduced in 2023 Check Details

4. రెబా మోనికా జాన్:సామజవరగమన సినిమాతో శ్రీవిష్ణు సరసన నటించిన మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బూ అనే చిత్రంలోనూ కనిపించింది. మొదటి సినిమాతోనే హిట్టు కొట్టిన ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

5. గీతికా తివారీ:అహింస సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది గీతికా తివారి. ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ సరసన నటించింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

6. అవంతిక దాసాని:బెల్లంకొండ గణేష్ బాబుతో కలిసి నేను స్టూడెంట్ సర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అవంతిక దాసాని. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

7. సారయ లక్ష్మణ్:సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించిన మేమ్ ఫేమస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది సారయ లక్ష్మణ్. అద్భుతమైన మాట తీరుతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

New Telugu Heroines Introduced in 2023 Check Details

8. యుక్తి తరేగా:రంగబలి సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిందీ క్యూట్ బ్యూటీ యుక్తి తరేగా. ముఖ్యంగా నాగ శౌర్య పక్కన నటించి ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X