రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్టు.. తెరపైకి కొత్త యువతి.. ఎవరీ ప్రీతి?
రెండు నెలలు గడుస్తున్నా రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు సరికదా నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. తనతో సహజీవనం చేసి, మరో అమ్మాయి మోజులో పడి తనను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నాడన్నది లావణ్య ప్రధాన ఆరోపణ. తాను గర్భం దాల్చితే రాజ్ అబార్షన్ చేయించాడని, దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఫోటోలను ఆమె హైదరాబాద్ నార్సింగి పోలీసులకు అందజేశారు. వీటి ఆధారంగా పోలీసులు రాజ్ తరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
లావణ్య తరపున ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ కేసును చూస్తున్నారు. ఆయన కూడా తన అనుభవంతో లావణ్యకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజ్ సైతం న్యాయ పోరాటం ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. మధ్యలో ఆమెతో రాజీ చేసుకునేందుకు రాయబారాలు సాగించినట్లుగా వార్తలు వచ్చాయి. తనకు రాజ్ మేనేజర్ ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకుని, క్షమాపణలు చెబితే రూ. కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడని లావణ్య సైతం వ్యాఖ్యానించింది.

మధ్యలో రాజ్ ఫ్రెండ్‌నంటూ ఆర్జే శేఖర్ భాష హల్‌చల్ చేస్తున్నాడు. ఈయన పలు ఛానెళ్లలో లైవ్ డిబేట్స్, ఫోన్ ఇన్‌లు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. రాజ్ ఫ్లాట్ కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని, తనపైనా తప్పుడు ఆరోపణలు చేస్తోందని శేఖర్ ఆరోపించారు. ఈ ఇంటర్వ్యూలలో రాజ్ తండ్రి బసవరాజుకు ఫోన్ కలిపి ఆయనతోనూ కొన్ని విషయాలు చెప్పిస్తున్నాడు. మొన్నామధ్య శేఖర్‌కి లావణ్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంబంధం లేని వ్యక్తివి.. భార్యాభర్తల మధ్యలోకి ఎందుకు దూరుతున్నావంటూ లావణ్య మండిపడింది. అంతేనా ఓ టీవీ డిబేట్‌లో శేఖర్ భాషాను లైవ్‌లో చెప్పుతో కొట్టడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజ్‌తరుణ్ - మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామీ ప్రమోషన్స్ కార్యకమంలోనూ రచ్చ చేసింది. తన భర్తను కలవడానికి వచ్చానని, తనను లోపలికి వెళ్లనివ్వాలంటూ మీడియా ముందు నానా రచ్చ చేసింది. ఇదే ఈవెంట్‌లో లావణ్యపై విరుచుకుపడ్డారు రాజ్ తరుణ్. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. లీగల్‌గానే ముందుకు వెళ్తానని, పోలీసులకు కూడా వివరణ ఇచ్చానని ఆయన వెల్లడించారు.

ఇంతలో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తమకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్లుగా లావణ్యతో పరిచయం ఉందని వారిద్దరూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. ప్రీతి, ఉదయ్‌ల అందజేసిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, విచారణ జరిపి కేసు నమోదు చేయాలా.. వద్దా అనేది నిర్ణయిస్తామని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











