కాస్త ఆలస్యంగా రాజమౌళి ఆర్‌ఆర్ఆర్!
దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కలసి నటిస్తుండడంతో దేశం మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ లో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇదే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ ప్లానింగ్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
తాజగా ఈ చిత్ర షూటింగ్ గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రాన్ని 2019 జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏ చిత్ర కథ గురించి కూడా అనేక ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి. ఏది ఏమైనా జక్కన్నే స్వయంగా అధికారికంగా అన్ని విషయాలు ప్రకటించేంతవరకు ఆర్ఆర్ ఆర్ విషయంలో ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications











