ప్రముఖ తారలతో బిగ్గెస్ట్ న్యూఇయ‌ర్ ఈవెంట్

కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న వేళ‌.. 31 రాత్రి సెల‌బ్రేష‌న్స్ కోసం యూత్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూడ‌డం స‌హ‌జం. అలాంటి ఉత్సాహం ఉర‌క‌లెత్తే యూత్ కోసం భారీ మ‌స్తీ ఈవెంట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. టాలీవుడ్‌లోనే ది బెస్ట్ ఈవెంట్‌ని టాలీవుడ్ టాప్ స్టార్ల‌తో ప్లాన్ చేస్తోంది యూ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ‌. ఈ కొత్త సంవత్స‌ర ఈవెంట్‌ని 2019 ఎలైట్ న్యూఇయ‌ర్ ఈవ్‌ పేరుతో హైటెక్ సిటీ- యోలో అరేనా (లేన్ బిసైడ్ కింగ్స్‌)లో నిర్వ‌హించ‌నున్నారు. ఈవెంట్‌లో పాల్గొనే సినీ ప్రముఖుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

 New year 2019 biggest celebrations with Film stars

తాజాగా ఈ ఈవెంట్‌కి సంబంధించి బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. టాలీవుడ్ యువ‌క‌థానాయిక‌లు యామిని భాస్క‌ర్‌, నిత్యాశెట్టి, అలేఖ్య ఏంజెల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ షోకి సంబంధించిన టిక్కెట్ బ్రోచ‌ర్‌ని యామిని భాస్క‌ర్ లాంచ్ చేయ‌గా, బుక్‌మై షో ఇత‌ర వెబ్‌సైట్ల బ్రోచ‌ర్‌ని నిత్యా శెట్టి, అలేఖ్య లాంచ్ చేశారు. బుక్ మై షో, గోవెంట్జ్‌, నియ‌ర్‌బై డాట్‌కాం వంటి వెబ్‌సైట్ల‌లో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి.

బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం యామిని భాస్క‌ర్ మాట్లాడుతూ -ప్ర‌తియేటా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్ని యూత్ ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది కూడా 31 రాత్రి సంబ‌రాల కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారంతా. హైద‌రాబాద్‌లోనే బిగ్గెస్ట్ ఈవెంట్‌ని యు మీడియా నిర్వ‌హిస్తోంది. ఇందులో ర‌క‌ర‌కాల డ్యాన్సింగ్ షోస్, స్కిట్స్, స్పెష‌ల్ షోలు రంజింప‌జేస్తాయి. అంద‌రికీ వెల్‌కం అని అన్నారు.

నిత్యా, అలేఖ్య మాట్లాడుతూ - హైదరాబాద్ బెస్ట్ ఈవెంట్‌లో పార్టిసిపెంట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ షోలో స్పెష‌ల్ లైవ్ ట్రీట్ యూత్‌కి మ‌స్త్ మ‌జాగా అందిస్తాం అని తెలిపారు. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో ది బెస్ట్ ఈవెంట్‌ని నిర్వ‌హిస్తున్నామ‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

కాళిచ‌ర‌ణ్ సంజ‌య్, తారా చౌద‌రి, త్రివేణిరావ్‌, దీపు నాయిడు, అలేఖ్య ఏంజెల్‌, స్పేస్ విజన్ సీఈవో న‌ర‌సింహారెడ్డి, ఎస్ మీడియా సుమంత్‌- ప్ర‌శాంత్, కేట్ టెక్నాల‌జీస్ కార్తీక్‌, ఫ్లాంట్ మార్కెట్ కెప్టెన్ అహ్మ‌ద్, యూమీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత‌లు క‌ళ్యాణ్ సుంక‌ర‌, వివాన్ కుసుంబా త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X