ఎప్పుడూ సెక్స్ ఆలోచనేనా? నువ్వు 2 మినిట్స్ గాడివే: తమన్నా మాటలు హాట్ టాపిక్

తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, లారిస్సా బొనెసీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ పూరి, రైనా జోషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన 'నెక్ట్స్ ఏంటి?' టీజర్ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులో తమన్నా చెప్పే డైలాగులు హాట్ టాపిక్ అయ్యాయి. లుక్ పరంగా కూడా అదరగొట్టింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో అందాల దేవతలా దర్శమిచ్చిన మిల్కీ బ్యూటీ యూత్ మతి పోగొడుతోంది.

మీకు ఎప్పుడూ అదే ఆలోచనా?

మీకు ఎప్పుడూ అదే ఆలోచనా?

మీ అబ్బాయిలకు ఎప్పుడూ అదే(సెక్స్) ఆలోచనా? అంటూ ఫ్లైట్ జర్నీ సీన్లో తమన్నా... నవదీప్‌ను అడిగే సన్నివేశం బట్టి చూస్తే సినిమా కాన్సెప్ట్ యువత ఆలోచనకు దగ్గరగా ఉంటుందని స్పష్టమవుతోంది.

నువ్వు 2 మినిట్స్ గాడివే..

నువ్వు 2 మినిట్స్ గాడివే..

ఇందులో సందీప్ కిషన్, తమన్నా.... ప్రేమికులుగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినపుడు.... నేను నీ నిజ స్వరూపం బయట పెడతాను అని సందీప్ కిషన్ బెదిరించడం.... నువ్వు 2 మినిట్స్ మ్యాగీ నూడుల్స్ గాడివి అని చెబుతాను... నువ్వు చెప్పే విషయం కంటే నేను చెప్పే విషయం త్వరగా స్ప్రెడ్ అవుతుంది అని తమన్నా వార్నింగ్ ఇస్తుంది. ఈ డైలాగులో చాలా డబల్ మీనింగ్ అర్థముందని స్పష్టమవుతోంది.

లారిస్సా బోనేసితో ముద్దు సీన్

లారిస్సా బోనేసితో ముద్దు సీన్

ఇందులో నటిస్తున్న మరో హీరోయిన్ లారిస్సా బోనేసితో ముద్దు సీన్ చేశాడు సందీప్ కిషన్. మొత్తానికి సినిమా యువతరం మెచ్చే రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్‌గా ఉంటుందని స్పష్టమవుతోంది.

బాలీవుడ్ డైరెక్టర్ తొలిసారి తెలుగులో...

బాలీవుడ్ డైరెక్టర్ తొలిసారి తెలుగులో...

ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. గతంలో కునాల్ కోహ్లీ హిందీలో ‘ఫనా', ‘హమ్ తుమ్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమా ఔట్ పుట్ చూస్తుంటే బాలీవుడ్ స్టైల్‌లో ఉంటుందని స్పష్టమవుతోంది.

నెక్ట్స్ ఏంటి?

ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లండన్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X