Mega Children: నెక్స్ట్ మెగా వారసులు వీళ్లే... ఇందులో ఎంత మంది హీరోలు, హీరోయిన్లు అవుతారో?

సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది సహజం. ఎవరైనా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే.. వారికి సపోర్ట్ గా ఇండస్ట్రీలోని వారైతే ఈజీగా సినిమాల్లోకి వస్తారు. అలా ఇప్పటివరకు ఎన్నో ఫ్యామిలీలు, వారి వారసులు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.. అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ.. ఇలా ఎంతో మంది వారి వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు. అయితే ఇప్పుడు ఓ ఫోటో నెక్ట్స్ మెగా వారసులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండస్ట్రీలోకి వారసులు వస్తుంటారు పోతుంటారు అది సహజం. అయితే తమ టాలెంట్ తో నిలబెట్టుకునే వారే అసలైన నటులు. అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు వచ్చి స్టార్ హీరోలు అయిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరోలు ఎంటర్ అయ్యారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, చైతన్య, అఖిల్ వచ్చి స్టార్స్ అయ్యారు. కృష్ణ ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ ఇలా చాలా మంది హీరోలు స్టార్స్ గా ఎదిగారు.

Next Mega Hero Heroins: Mega Children Photo Goes Viral in Social Media

ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు రాగా వారి వారసులు రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక వచ్చారు. ఇక వారి మేన అల్లుడ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హీరోలుగా అడుగుపెట్టి సక్సస్ అయ్యారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ ఎంటర్ అయి.. ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక తనే ఓ బ్రాండ్ గా మారి.. స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అల్లు కుటుంబం నుంచి అల్లు అర్జున్, శిరిష్ ఎంటర్ అయ్యారు.

ఇలా ఫ్యామిలీల నుంచి వారసులు రావడం కామన్ అయిపోయింది. ఇక నెక్ట్స్ మెగా వారసులు వీరే అంటూ ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరిగినప్పుడు.. మెగా అల్లు ఫ్యామిలీలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి నుంచి అనేక ఫ్యామిలీ ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా మరో ఫోటో బయటకి వచ్చి వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మెగా అల్లు ఫ్యామిలీకి చెందిన పిల్లలు అంతా కనిపిస్తున్నారు.

ఇక బాలల దినోత్సవం సందర్భంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పింది. దీంతో ఈ ఫోటో నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరంజీవి పెద్ద కూతురు పిల్లలు, చిన్న కూతురు పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు, ఇంకొంతమంది మెగా ఫ్యామిలీ పిల్లలు ఈ ఫోటోలు కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో చరణ్ కూతురు క్లిం కారా అయితే మిస్ అయింది.

Next Mega Hero Heroins: Mega Children Photo Goes Viral in Social Media

ఇక మెగా మనవళ్ళు, మనవరాళ్లు ఆ ఫోటోలో ఉండటంతో.. నెక్ట్స్ మెగా ఫ్యామిలీ వారసులు వీళ్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో జనరేషన్ రెడీ అవుతుందని అంటున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నటులంతా కలిసి ఒకే పిక్ తోనే వైరల్ అవ్వడం కాకుండా ఇప్పుడు ఇలా మెగా చిల్డ్రన్స్ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత మంది హీరోలు, హీరోయిన్లు అవుతారో చూాడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X