twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NFT సినీ పరిశ్రమలోనే తొలి మూవీ మార్కెట్ ప్లేస్.. ఒరాకిల్ మూవీస్ సీవోవో విజయ్ డింగరి

    |

    భారతదేశంలోనే మొట్టమొదటి నాన్ ఫింగిలుబల్ టోకెన్ (NFT) మూవీ మార్కెట్‌ ప్లేస్‌గా ఒరాకిల్ (Oracle) మూవీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ నిర్మాతలు మరింతగా ఆదాయం ఆర్జించడమమే దీని లక్ష్యం. దీంతో భారతదేశంలో సినిమా బిజినెస్ రూపురేఖలే గణనీయంగా మారిపోతాయని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో భాగంగానే టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ సెంథిల్ నాయగమ్, చిత్ర నిర్మాత, మూవీ బిజినెస్ కన్సల్టెంట్ జీకే తిరునావుక్కరసు కలిసి ఒరాకిల్ మూవీస్ సంస్థను స్థాపించడానికి ముందుకొచ్చారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ప్రప్రథమ NFT మూవీ మార్కెట్ ప్లేస్ కానుంది.

    నాన్-ఫంగిబుల్ టోకెన్‌ (NFT) అధునాతనమైన, సురక్షితమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా మూవీ రైట్స్ కొనడానికి, అమ్మడానికి ఇది చిత్రనిర్మాతలకు, కంపెనీలకు తోడ్పడుతుంది. NFT ఎంత విశిష్టమైనదంటే, మరేదీ దీన్ని భర్తీ చేయలేదు. కాబట్టి ఇది మాల్ ప్రాక్టీస్‌లను నిరోధించడమే కాకుండా, స్టాక్‌హోల్డర్లకు సురక్షితమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. ప్రారంభంలో ఒరాకిల్ మూవీస్ సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల నిర్మాతలకు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) రైట్స్ ఉన్నవారికి తన సేవలను అందించనుంది. అతి త్వరలోనే ఈ సేవలు దేశంలోని ఇతర భాషల చిత్రాలకు కూడా విస్తరించనున్నాయి.

    NFT trade will change movie world fate: Oracle Movies COO Vijay Dingari

    ఒరాకిల్ మూవీస్ సంస్థ సీవోవో విజయ్ డింగరి మాట్లాడుతూ.. ప్రస్తుతం కంటెంట్ అనేది కింగ్.. ఓటీటీలు సరైన కంటెంట్ కోసం వెతుకుతున్నాయి. అలాగే నిర్మాతలు కంటెంట్ కోసం, అలాగే వారి దగ్గర ఉన్న కంటెంట్‌ను అమ్మేందుకు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఓటీటీలకు, నిర్మాతలకు మధ్య ఉన్న అంతరాన్ని NFT తీర్చుతుంది. ఒక్కోసారి తమ దగ్గర ఉన్న కంటెంట్ ఏదో విధంగా అమ్ముడైతే చాలు అన్నట్లుగా తెలియక వ్యవహరిస్తుంటారు.

    NFT trade will change movie world fate: Oracle Movies COO Vijay Dingari

    అలాంటి వారికి అవగాహన పెంచేలా, ధరతో పాటు ఏ ప్లాట్‌ఫామ్ కరక్ట్ అనే విషయాన్ని కూడా సూచించడంలో NFT సహాయం చేస్తుంది. ప్రస్తుత చిత్ర వాణిజ్యం కాగితపు ఒప్పందాలపైనే ఆధారపడి ఉన్నందున, ఇది ఆధునిక సినిమాకు ఏమంత మంచిది కాదు. అలాగే మూవీ రైట్స్‌ను అమ్మిన ట్రాక్‌ను కనిపెట్టడానికి ఒక సెంట్రల్ ఏజెన్సీ కూడా ఈ వ్యవస్థలో అందుబాటులో లేదు. ఈ భారీ అంతరాన్ని పరిష్కరించడానికే NFT సులభమైన రీతిలో అడుగుపెడుతోంది. ఒరాకిల్ మూవీస్ కూడా అలాంటి వన్ స్టెప్ సర్వీస్ ప్రొవైడర్‌ పాత్రను పోషించనుంది. ఇంకా ఇతర వివరాల కోసం [email protected] లేదా 9000088877 నంబర్‌కు సంప్రదించవచ్చు అని తెలిపారు.

    English summary
    Technology entrepreneur Senthil Nayagam and Film Producer & Movie Business consultant G K Tirunavukarasu have joined together to float Oracle Movies, which would be the India's first NFT Movie Market Place. 'Non-fungible Token', shortly NFT, allows film producers and companies to buy and sell movie rights through advanced and secure block chain technology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X