‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ విషయంలో ఎవరినీ నమ్మని ఆర్జీవీ... దిమ్మదిరిగే ప్లాన్!
Recommended Video

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు, అవి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపాయి? రామారావును వెన్నుపోటు పొడించింది ఎవరు? ఈ కుట్రలో ఎవరెవరు భాగం అయ్యారు? లాంటి వివాదాస్పద అంశాలు చూపించబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసే విధంగా ఉందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కానిస్తారా? అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.

ఎవరినీ నమ్మని ఆర్జీవీ... దిమ్మదిరిగే ప్లాన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రిలీజ్ చేసే విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లను రామ్ గోపాల్ వర్మ నమ్మడం లేదట. అందుకే ఈ చిత్రాన్ని వారెవరికీ కట్టబెట్టుకుండా ముంబైకి చెందిన ‘ఎన్‌హెచ్ స్టూడియోస్' సంస్థకు థియేట్రికల్ రైట్స్ అప్పగించారు.

ట్విట్టర్ ద్వారా ప్రకటించిన వర్మ
‘ఎన్‌హెచ్ స్టూడియోస్' సంస్థకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేట్రికల్ రైట్స్ అప్పగించినట్లు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పింక్, శివాయ్, ట్యూబ్ లైట్, జబ్ హ్యారీ మెట్ సెజల్, బేగం జాన్, డియర్ జిందగీ, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్త...‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో తెలుగు మార్కెట్లోకి ఎంటరవుతోంది.

ఓవర్సీస్ రైట్స్ ఎవరికంటే..
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్ ‘వీకెంట్ సినిమా' అనే సంస్థకు అప్పగించారు. తాను సినిమాలో చూపించబయే వాస్తవాలను పొలిటికల్ ఒత్తిళ్లకు లొంగకుండా థియేటర్ల వరకు తీసుకెళ్లే దమ్మున్న డిస్ట్రిబ్యూటర్లను రామ్ గోపాల్ వర్మ ఏరి కోరి ఎంపిక చేశారట.

కుటుంబ కుట్రల చిత్రం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పోస్టర్లు కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్ లైన్‌తో డిజైన్ చేయడం... వెన్నుపోటు పర్వం ప్రధానంగా చూపించబోతున్నామని ప్రచారం చేయడం ద్వారా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుంది.
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు


Click it and Unblock the Notifications











