వారణాసి పై ప్రియాంక చోప్రా భర్త ఫస్ట్ రియాక్షన్.. రాజమౌళి- మహేశ్ మూవీపై అంచనాలు పెంచేశారుగా!
Varanasi: దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ వారణాసి (Varanasi). ఈ భారీ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. విడుదలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నా, ఈ ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాతో ఇండియన్ సినిమాలకు రీఎంట్రీ ఇవ్వడం ఈ హైప్‌కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇటీవల ప్రియాంక భర్త, అంతర్జాతీయ పాప్ సెన్సేషన్ నిక్ జోనస్ (Nick Jonas) వారణాసి మూవీపై రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఏమన్నారంటే..?
వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. టైమ్ మిషన్‌లో ఉన్న రగ్గడ్ ఎక్స్‌ప్లోరర్‌గా కనిపించనున్నారని టాక్. కథ మొత్తం గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా, హై-స్టేక్స్ నరేషన్‌తో రూపొందుతోందని ప్రచారం. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్-వరల్డ్ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ కథకు మరింత బలం చేకూర్చేది ప్రతినాయకుడు పాత్ర. ఈ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ 'కుంభ'గా కనిపించనున్నారు. వీల్‌చైర్‌కే పరిమితమైనా, అత్యంత భయంకరమైన విలన్‌గా ఆయన పాత్రను రూపొందించినట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌నే సూచిస్తోంది. రుద్ర ప్రయాణంలో అతడే అతిపెద్ద అడ్డంకిగా నిలవబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.
మందాకినిగా ప్రియాంక - పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్
ఇక ఈ పాన్ వర్డల్ మూవీ ప్రియాంక 'మందాకిని'పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పసుపు చీర, చేతిలో పిస్టల్‌తో కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆమెకు పూర్తిగా యాక్షన్-డ్రివెన్, స్ట్రాంగ్ క్యారెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ సెట్స్‌కు తిరిగివచ్చిన ప్రియాంక, ఈ ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన అనుభవంగా పేర్కొన్నట్టు సమాచారం.
ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. 'వారణాసి'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాక్ సాంగ్ షో (Zach Sang Show)లో మాట్లాడిన నిక్... భార్య ప్రియాంక ఈ సినిమాపై చూపిస్తున్న అంకితభావాన్ని కొనియాడారు. అంతేకాకుండా రాజమౌళి వారణాసి మూవీపై కామెంట్స్ చేశారు. నిక్ మాట్లాడుతూ 'ప్రియాంక గత 14 నెలలుగా విడతలుగా షూటింగ్ చేస్తోంది. ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ మూవీ. RRR లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇదే ఆయన నెక్ట్స్ బిగ్ ఫిల్మ్. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది' అని వెల్లడించారు. రాజమౌళి తెరకెక్కించిన RRR ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఘన విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'వారణాసి'పై గ్లోబల్ లెవెల్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పాన్-వరల్డ్ రిలీజ్
మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. 'వారణాసి'ను 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మార్క్ గ్రాండ్ విజన్, అంతర్జాతీయ టెక్నికల్ టీమ్, మహేశ్-ప్రియాంక-పృథ్వీరాజ్ స్టార్ పవర్ అన్ని కలసి ఈ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీల జాబితాలో అగ్రస్థానంలో నిలిపాయి. దీనికి తోడు నిక్ జోనాస్ చేసిన తాజా వ్యాఖ్యలు సినిమాపై గ్లోబల్ హైప్‌ను మరింత పెంచేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











