పవన్ కల్యాణ్ కోసం హాలీవుడ్ లెజెండ్.. డిప్యూటీ సీఎం నుంచి బిగ్ సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆయన.. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాల్లో నటించి అలరించారు. ఇలా ఇప్పుడు కూడా మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా పవర్ స్టార్ పనవ్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.
పవన్ కల్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి రూపొందిస్తోన్న సినిమానే 'హరిహర వీరమల్లు'. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాలతో షూటింగ్‌కు చాలా బ్రేక్స్ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

'హరిహర వీరమల్లు' మూవీ షూట్‌ను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ ప్రచారం అయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'హరిహర వీరమల్లు షూట్‌కు పవన్ కల్యాణ్ గారి డేట్స్ ఎక్కువగా లేవు. కాబట్టి వీలు చూసుకుని ఆయనే వచ్చి సినిమాను పూర్తి చేస్తారు' అని చెప్పారు.
నిర్మాత ఏఎమ్ రత్నం వెల్లడించినా 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో 'మా పోరాట యోధుడి సాగా హరిహర వీరమల్లు షూటింగ్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి పున: ప్రారంభం కాబోతుంది' అని ప్రకటించింది. ఇదే పోస్టులో 'పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో హాలీవుడ్ లెజెండ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ జరగబోతుంది' అని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











