డైరెక్టర్‌కు స్పెషల్ వెల్‌కమ్.. క్రిష్‌పై నిధి అగర్వాల్ కామెంట్
ప్రస్తుతం క్రిష్ పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీకి సంబంధించిన ప్రకటన రాబోతోన్న సందర్భంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి మొదలైంది. నేటి సాయంత్రం ఈ అప్డేట్ రాబోతోంది. మరి కాసేపట్లో అసలు సిసలు అప్డేట్ రానుంది. అయితే క్రిష్ తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చేందుకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు.
క్రిష్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. ఫేస్ బుక్, ట్విట్టర్‌లో క్రిష్ అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు. అయితే క్రిష్‌కు ఇన్ స్టాగ్రాం అకౌంట్ ఏమీ లేదు. కానీ ఆ మధ్య అషూ రెడ్డి ఓ అకౌంట్‌ను క్రిష్ అకౌంట్ అంటూ ట్యాగ్ చేసేసింది. కానీ అది క్రిష్ ఇన్ స్టా కాదని తెలుసుకుని పొరబాటును సరి దిద్దుకుంది. వెంటనే ఆమె తన పోస్ట్‌ను ఎడిట్ చేసింది. క్రిష్‌కు ఇన్ స్టా అకౌంట్ లేదని క్లారిటీ ఇచ్చింది.

కానీ తాజాగా క్రిష్ ఇన్ స్టాగ్రాంలోకి అడుగుపెట్టేశాడు. తన సెట్‌లోంచి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఫస్ట్ పోస్ట్ చేసేశాడు. ఇక తన డైరెక్టర్‌కు నిధి అగర్వాల్ స్పెషల్ వెల్ కమ్ చెప్పేసింది. ఇన్ స్టాగ్రాం ప్రపంచంలోకి స్వాగతం క్రిష్ అంటూ సెట్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇద్దరూ కూడా నటించబోతోన్నారంటూ తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











