అభిమానులకు మత్తెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ బీచ్ ఫోటో!
హైదరాబాద్‌లో పుట్టి బెంగుళూరులో పెరిగిన మార్వాడి బ్యూటీ నిధి అగర్వాల్‌కు 2017లో 'మున్నా మైఖేల్' అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే తొలి చిత్రం పెద్ద ప్లాప్ కావడంతో వెంటనే తన ఫోకస్ సౌత్ సినిమాలపై పెట్టింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్, ఆ తర్వాత అఖిల్‌తో కలిసి 'మజ్ను' అనే సినిమా చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడక పోవడంతో నిధి అగర్వాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
సినిమాల జయాపజయాలు పక్కన పెడితే... గ్లామర్ పరంగా యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బికినీకి పర్ఫెక్టుగా సెట్టయ్యే టోన్డ్ బాడీతో అందాల నిధిలా మారిపోయింది. తాజాగా ఆమెకు సంబంధించి ఓ బీచ్ పిక్ కుర్రకారును ఉక్కిరి బిక్కరి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఆమెకు 3 మిలియన్ ఫాలవర్స్ ఉన్నారు.

నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే... ఇక్క, మాస్క్ అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు ఆమో నటించిన మరో చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీపై నిధి అగర్వాల్ భారీగా ఆశలు పెట్టుకుంది.
ఇస్మార్ట్ శంరర్ మూవీలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది.


Click it and Unblock the Notifications











