ఇస్మార్ట్ బ్యూటీతో పవన్ కల్యాణ్ చిందులు: సీక్రెట్‌గానే మొత్తం పని కానిచ్చేశారుగా

చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో చిత్ర సీమలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇది పట్టాలపై ఉండగానే క్రిష్ జాగర్లమూడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడాయన. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ పిరియాడిక్ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇందుకోసం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌తో తాజాగా ఆయన కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో ఆమెతో ఓ పాటను కూడా చిత్రీకరించాడని అంటున్నారు. అందులో పవన్ కల్యాణ్ కూడా ఆమెతో కలిసి స్టెప్పులు వేశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి చేసేది చిన్న పాత్రే అయినా.. చాలా ప్రభావం చూపించేదిగా ఉంటుందని చెబుతున్నారు. ఎప్పటి లాగే ఇందులోనూ ఆమె అందాల విందు ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

Nidhhi Agerwal Shoot Completed for Pawan Kalyan - Krish Movie

ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సైతం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో ఊహించని విధంగా నిధి అగర్వాల్ పేరు తెరపైకి రావడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. మొత్తానికి పవన్ కెరీర్‌లోనే మొదటి సారి రాబోతున్న ఈ పిరియాడిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X