స్టార్ హీరోయిన్‌కి నిధి అగర్వాల్ కౌంటర్ .. నేను ఆ బ్యాచ్ కాదంటూ మాస్ రిప్లై..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్ విషయంలో కొత్త సరుకు ల్యాండ్ అవుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఒకపుడు కొంతమంది హవా కనబరిస్తే వారి తర్వాత ఇంకొందరు వచ్చి సత్తా చాటేవారు. ఇలా ఎప్పటికప్పుడు హీరోయిన్స్ తెలుగు సినిమా దగ్గర అప్‌డేట్ అవుతూనే ఉంటారు. ఇలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ అంటే తెలియని వారు ఉండరు.
కాజల్ తన కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ ని అందుకొని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో "మగధీర" సినిమాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. ఇక్కడ నుంచి కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతూ వచ్చింది. తనతో పాటుగా చాలా మంది ఇతర హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ కాజల్ స్టార్డం మాత్రం తెలుగులో ఏమాత్రం తగ్గలేదు.

అయితే కొంతమంది హీరోయిన్స్ మన తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ మన ప్రేక్షకులకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి తెలుగు నేర్చుకుని మరీ అలరించేందుకు యత్నిస్తున్నారు. ఓపెన్‌గా చెప్పాలంటే కాజల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి తనతో కెరీర్ మొదలు పెట్టిన, తన తర్వాత వచ్చిన హీరోయిన్స్ అంతాకూడా తెలుగులో స్టార్ స్టేటస్ తో పాటుగా గౌరవాన్ని తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్స్ అంతా మన తెలుగు భాషనీ నేర్చుకొని తెలుగులోనే మాట్లాడేందుకు ట్రై చేసేవారు.
ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా కాజల్ మాత్రం ఇన్ని సినిమాల్లో ఒక్క "అందరికీ నమస్కారం" అనే మాట తప్పితే ఇంకో మాట తెలుగులో మాట్లాడిన దాఖలాలు లేవు. దీనితో కాజల్ విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. దీనితో ఆమె తెలుగు ఆడియెన్స్ నుంచి తెలుగు నిర్మాతల నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటుంది కానీ మన తెలుగు ఆడియెన్స్ తో కనీసం తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా ఇన్నేళ్ళలో చేయలేకపోయిందంటూ ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
Vastundi andi.. Enduku doubt? I am not only “andariki namaskaram” batch ok? 😝 https://t.co/GPK99kUl0P
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 3, 2024
అయితే దీనిపైనే అన్నట్టుగా టాలీవుడ్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక మాస్ రిప్లై అయ్యితే ఇచ్చింది. సోషల్ మీడియాలో తనకి తెలుగులో మాట్లాడ్డం వచ్చా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి గాను వస్తుంది అండి.. ఎందుకు డౌట్? నేను అందరికీ నమస్కారం బ్యాచ్ కాదు" అంటూ మాస్ రిప్లై ఇచ్చింది.
దీనితో ఈ రిప్లై మాత్రం ముమ్మాటికీ కాజల్ అగర్వాల్ ని ఉద్దేశించే ఇచ్చింది అంటూ ఆమె వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఆమె ఇచ్చిన అన్ని రిప్లై లలో కూడా దీనికే అత్యధిక లైక్స్ రావడం గమనార్హం. దీనితో కాజల్ లాంటి హీరోయిన్స్ కే నిధి అగర్వాల్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు.. అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే పాన్ ఇండియా చిత్రాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications











