పవన్ కళ్యాణ్ కోసం ఇస్మార్ట్ హీరోయిన్.. అదే నిజమైతే కెరీర్ సెట్టయినట్లే
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానాల్లో పోటాపోటీగా దూసుకుపోతున్న హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మీక మందన్న. గత ఏడాది నుంచి అగ్ర హీరోలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీలు సీనియర్ హీరోయిన్స్ ని తెలియకుండానే డామినేట్ చేసేస్తున్నారు. ఇక వీరికి పోటీని ఇవ్వడానికి మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్న బ్యూటీలలో నిధి అగర్వాల్ ఒకరు. అమ్మడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
గతంలో అక్కినేని హీరోలతో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసిన నిధి అగర్వాల్ ఆ తరువాత తొందరపడకండా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తోందట. ఇక ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పెంచినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక నిధి అగర్వాల్ కి రీసెంట్ గా ఒక మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పవన కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పిరియాడిక్ డ్రామాలో నిధి మెయిన్ హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందట.

అసలైతే మొదట ఆ ప్రాజెక్టులో జాక్వలన్ ఫెర్నాండేజ్ ఫిక్స్ అయినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు దర్శకుడు నిధి వైపు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడి కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం కాయం. స్టార్ హీరోలతో నటిస్తేనే అగ్ర హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి నిధి అగర్వాల్ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం నిధి అశోక్ గల్లా మొదట సినిమాతో పాటు తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











