మా ఆయనకు సినిమాలంటే ఇష్టమే.. మొత్తానికి మెగా అల్లుడి టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ ఫ్యామిలిలో మెగా కుటుంబం టాప్ లో ఉందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయకపోతే ఎవరైనా సరే అనుకున్నంత రేంజ్ కు రాలేరు. మెగా కుటుంబంలో ఏ హీరో కూడా అంత ఈజీగా సక్సెస్ ట్రాక్ లోకి రాలేదు. మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా హార్డ్ వర్క్ బాగానే చేశాడు. కష్టానికి తగ్గట్లుగా బాక్సాఫీస్ విజయం దక్కింది. ఇక త్వరలో మెగా ఫ్యామిలీ నుంచి కొత్త అల్లుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తుండగా ఫైనల్ గా నిహారిక ఒక క్లారిటీ ఇచ్చింది.

ఆడియెన్స్ ను మెప్పిస్తేనే..

ఆడియెన్స్ ను మెప్పిస్తేనే..

నిజానికి ఆడియెన్స్ సపోర్ట్ చేస్తేనే ఏ హీరో అయినా ఒక మార్కెట్ సెట్ చేసుకోగలడు. ఇక మెగా హీరోలు కూడా చాలా వరకు విభిన్నమైన పద్దతిలో సక్సెస్ అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అలాగే సాయి తేజ్, వరుణ్ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదట్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవడానికి కొంత కష్టపడ్డారనే చెప్పాలి.

వైష్ణవ్ తేజ్ కూడా అలానే మొదటి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఫైనల్ గా ఆడియెన్స్ ను మెప్పిస్తేనే ఎంతటివారైనా నిలదొక్కుకుంటారని మెగా హీరోలు నీరూపించారు.

కొత్తల్లుడు ఎంట్రీ ఎప్పుడు..

కొత్తల్లుడు ఎంట్రీ ఎప్పుడు..

గత కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను మెగా సపోర్ట్ లేకుండా ఎదగాలని బాగానే ట్రై చేస్తున్నాడు. ఇక కొత్తల్లుడు చైతన్య జొన్నలగడ్డ కూడా త్వరలోనే టాలీవుడ్ కు సరికొత్తగా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలు ఉన్నట్లు రూమర్స్ అయితే చాలా కాలంగా వస్తున్నాయి.

స్పందించిన నిహారిక

స్పందించిన నిహారిక

చైతన్య మంచి హైట్ తో చూడటానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కానీ లుక్స్ ఉన్నంత మాత్రాన క్లిక్కవుతారనే గ్యారెంటీ లేదు. అయితే ఈ చైతన్య ముందు యాక్టింగ్ పై శిక్షణ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని, ఇక ఆ తరువాత మెల్లగా వెబ్ సిరీస్ లతో తన టాలెంట్ ను నిరూపించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు గాసిప్స్ ఒక రేంజ్ లో రాగా ఫైనల్ గా నిహారిక ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం

చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం

నిహారిక మాట్లాడుతూ.. చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం కేవలం చూడటం వరకే. మా ఆయన సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రెగ్యులర్ గా సినిమాలు చూడటానికి అమితంగా ఇష్టపడతాడు కానీ సినిమాల్లోకి రావాలని ఎంతమాత్రం అనుకోవడం లేదు.. అంటూ నిహారిక ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

సపోర్ట్ చేస్తాడట

సపోర్ట్ చేస్తాడట

నిహారిక మొదట నాన్నకూచి వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ లపై నిహారికకు అనుభవం ఉంది కాబట్టి ఆమెకు చైతన్య సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం ఒక నిర్మాతగా మాత్రం సపోర్ట్ తో ఉంటాడని మరొక రూమర్ అయితే వచ్చింది. ఆ విషయంపై ఇంకా నిహారిక ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం నిహారిక యాంకర్ అనసూయతో కలిసి ఒక వెబ్ సిరిస్ చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X