భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
పెళ్లి అంటే ప్రతి ఒక్కరిలో ఎలాంటి సంతోషాలు కనిపిస్తాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారం రోజుల ముందు నుంచే ఎన్నో సెలబ్రేషన్స్ తో కుటుంబం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి ఎలా జరిగిందో అందరికి తెలిసిందే. వేడుకకు సంబంధించిన అనేక రకాల ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. పలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల భర్త చేసిన పనికి.నిహారిక కన్నీళ్లు పెట్టుకోక తప్పలేదు.
Recommended Video
పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట
మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి చాలా కాలమయ్యింది. నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల, చైతన్య వివాహ మహోత్సవంలో వారి కలయిక ఎంతో ఆనందంగా గడిచింది. వేడుకలు ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. హిందు సాంప్రదాయం ప్రకారం నిహారిక మెడలో మూడు ముళ్ళు వేశాడు చైతన్య. ఇక వేడుకకు సంబంధించిన ఫొటోలను వీడియోలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

వరుణ్ తేజ్ ఆధ్వర్యంలోనే..
మొన్నటివరకు నాగబాబు నిహారిక పెళ్లికి సంబంధించిన ముమేంట్స్ ను యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉదయ్ పూర్ ప్యాలెస్ కు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నట్లు నాగబాబు తెలియజేశారు.

పెళ్లి కూతురిగా రెడీ అవుతున్న క్షణంలో..
అయితే ఇటీవల నిహారిక ఒక ఎమోషనల్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అందులో ఆమె భర్త మాటలకు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. నిహారిక పెళ్లి కూతురిగా రెడీ అవుతున్న క్షణంలో చైతన్య తన కాబోయే భార్యకోసం ఒక అద్భుతమైన వీడియో రెడీ చేశాడు. ప్రేమతో అతను నిహారిక హార్ట్ ను టచ్ చేసినట్లు అర్ధమవుతోంది.

తుది శ్వాసవరకు గుర్తు పెట్టుకుంటాను
'డియర్ నిహా..వివాహంతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి. నీతో గడపబోయే క్షణాలను తుది శ్వాసవరకు గుర్తు పెట్టుకుంటాను. ముప్పై ఏళ్ళ నా జీవితంలో నేను కోల్పోయిన విషయం నువ్వు వచ్చాకే అర్ధమయ్యింది. నేను నీ కోసమే పుట్టానని, నా జీవితానికి అర్థం కూడా నువ్వేనని తెలిసింది'.. అంటూ చైతన్య వివరణ ఇచ్చాడు.
ఆ మాటలకు కన్నీళ్లు వచ్చేశాయి
చైతన్య అలా ప్రేమతో చెప్పగానే నిహారిక కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేశాయి. ఇక ఆమె భావోద్వేగానికి లోనవ్వడంతో మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత ప్రేమతో కౌగిలించుకున్నారు. ఇక పెళ్లి పీఠలపై కూడా నిహారిక ఎంతగానో ఎమోషనల్ అయ్యింది. మెగాస్టార్ కూడా కూతురిని నవ్వించే ప్రయత్నం చేశారు. మెగా హిరోలందరు చుట్టూ చేరి వదువరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











