Niharika భర్త చైతన్యపై కేసు.. అర్ధరాత్రి న్యూసెన్స్‌పై నోరు విప్పిన మెగా డాటర్.. అసలు జరిగింది ఇదే

సాధారణంగా సినీ సెలబ్రిటీలకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా సామాన్యులకు ఆసక్తికరంగా ఉంటాయి.. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న మెగా డాక్టర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య మీద పోలీస్ కేసు నమోదు అయిందని, అర్ధరాత్రి జరిగిన గొడవ కారణంగా ఈ కేసు నమోదయింది అనే విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.. ఎట్టకేలకు ఈ విషయం మీద జొన్నలగడ్డ చైతన్య నోరు విప్పాడు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

అర్ధరాత్రి చైతన్య న్యూసెన్స్

అర్ధరాత్రి చైతన్య న్యూసెన్స్

అనూహ్యంగా ఈరోజు ఉదయం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య పేరు తెలుగు మీడియాలో మారుమోగిపోయింది. బుధవారం అర్ధరాత్రి చైతన్య న్యూసెన్స్ సృష్టించాడని ఆరోపిస్తూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మీడియా కి సమాచారం అందింది.

తర్వాత కొద్దిసేపటికి చైతన్య కూడా సదరు అపార్ట్మెంట్ వాసులు మీద కంప్లైంట్ చేసినట్లుగా మీడియాకు సమాచారం అందింది.. అయితే అసలు ఏం జరిగింది అనే విషయం మీద సరైన క్లారిటీ లేకపోగా ఎవరు ఊహాగానాలు మేర వారు వార్తలు రాసేశారు. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే విషయం మీద నాగబాబు అల్లుడు నిహారిక భర్త చైతన్య నోరు విప్పారు

మా ఫ్లాట్ డోర్ బాదడంతో

మా ఫ్లాట్ డోర్ బాదడంతో

అపార్ట్మెంట్ లో జరిగిన గొడవ గురించి ఆయన పూర్తి వివరాలు వెల్లడిస్తూ ముందుగా అపార్ట్మెంట్ కి సంబంధించిన వారి మీద నేనే ఫిర్యాదు చేశానని కానీ మీడియాలో మాత్రం నా మీద ముందు కేసు నమోదైనట్లు గా వార్తలు వచ్చాయి అని అన్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో పాతికమంది వచ్చి ఒక్కసారిగా మా ఫ్లాట్ డోర్ బాదడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆ తర్వాత నేను ఫ్లాట్ రెంటుకు తీసుకున్న ఓనర్ కి విషయం వెల్లడించానని చెప్పారు.

అయితే తాను అసలు ఫ్లాట్ ఎందుకు అద్దెకు తీసుకుంటున్నాను అనే విషయం ఓనర్ కి చెప్పాను కానీ ఆ విషయం ఓనర్ మిగతా అపార్ట్మెంట్ వాసులకు చెప్పలేదని వారికి క్లారిటీ లేకపోవడంతోనే ఈ గొడవ జరిగిందని చెప్పుకొచ్చారు.

ఖాళీ చేసేస్తున్నాం

ఖాళీ చేసేస్తున్నాం

ఆ తర్వాత ఇరువురు కూర్చుని మాట్లాడుకునే చర్చించుకున్నాము అని ఆయన వెల్లడించారు. షేక్పేట్ లో ఉన్న Tancica అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం అని ఆ అపార్ట్మెంట్లో మరో 25 నుంచి 30 కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు.. ప్లాట్ యజమానికి సమాచారం ఇచ్చాకే ఇక్కడ కమర్షియల్ ఆఫీస్ పెట్టుకుంటామంటే ఆయన ఓకే చెప్పారని అయితే అపార్ట్మెంట్ లోని మిగతా వాళ్లు మాత్రం ఇబ్బంది కరంగా ఉందని వచ్చి గొడవ చేశారు అని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈనెల పదో తేదీన ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని జొన్నలగడ్డ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఈ అంశం మీద మెగా ఫామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

చైతన్య కెరీర్

చైతన్య కెరీర్

చైతన్య మే 2011 లో సూర్య రే ఎలిక్సిర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 2017-2018 లో ఆయన ప్రభుత్వ సలహా సంస్థ అయిన KPMG(క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గార్దెల)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. టెక్ మహీంద్రాలోకి రాకముందు, చైతన్య ది హరికేన్స్, ISB సూపర్ లీగ్ (2018-19)కి CEO మరియు సహ యజమానిగా పనిచేశారు. టెక్ మహీంద్రాలో, నిహారిక భర్త గ్లోబల్ లీడర్‌షిప్ కేడర్‌కు మేనేజర్‌గా, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ కోసం ప్రొడక్ట్ ఓనర్ మరియు గ్రోత్ స్ట్రాటజీకి మేనేజర్‌గా కూడా పనిచేశారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
అసలు ఆయన ఏమి చేస్తాడు అంటే?

అసలు ఆయన ఏమి చేస్తాడు అంటే?

చైతన్య జొన్నలగడ్డ ఒక బిజినెస్ స్ట్రాటజిస్ట్. అంతే కాక ప్రారంభ దశలో ఉన్న ఒక ఎంటర్ ప్రెన్యూర్. సెప్టెంబర్ 2020 నుండి గాట్లిచ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 31 ఏళ్ల చైతన్య జూలై 27, 1990 న జన్మించారు. భారతీయ విద్యా భవన్ లో 2003-05 వరకు చదివిన ఆయన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కళాశాలలలో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ (2008-12) నుండి తన ఎంఎస్(మాస్టర్ ఆఫ్ సైన్స్-మ్యాథమెటిక్స్) పూర్తి చేశాడు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (2018-19) నుండి స్ట్రాటజీ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీలను పొందారు. ఇక ఇప్పుడు కూడా ఆయన స్టార్ట్ అప్ బిజినెస్ ఒకటి పెట్టారని, డానికి సంబందించిన ఆఫీస్ అక్కడ పెట్టడంతోనే వివాదం మొదలయిందని వెల్లడించారు.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X