ఆ హీరోతో లవ్ యూ అనేసిన మెగా డాటర్.. నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు వారసురాలిగా మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. తొలుత హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత హీరోయిన్‌గా ట్రై చేసి అక్కడ సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చిన్న సినిమాలు నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన నిహారిక ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తుండగా రెండో పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
చైతన్య జొన్నలగడ్డతో గ్రాండ్ వెడ్డింగ్
2020లో రాజస్థాన్‌లో నిహారిక- చైతన్యల వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్లయిన రెండేళ్ల పాటు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో దూరంగా ఉంటూ వచ్చారు. నాగబాబు కుమారుడు, స్వయానా తన బావ అయిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌లో చైతన్య కనిపించకపోవడంతో సినీ జనాలకు, మీడియాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే తన కుటుంబంతో తిరుమలలో కనిపించారు చైతన్య.. అయితే ఆయన పక్కన నిహారిక లేకపోవడంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

చైతన్యతో నిహారిక విడాకులు
ఈ క్రమంలోనే నిహారిక- చైతన్యలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు, ఇతర వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఇద్దరూ డిలీట్ చేయడంతో విడాకుల ప్రచారానికి బలం చేకూరినట్లయ్యింది. దీనికి తెరదించుతూ చైతన్య - నిహారికలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా 2023 జూలైలో కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్ట్‌లో నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కోర్ట్ ఈ దంపతులకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
నిర్మాతగా సక్సెస్
విడాకుల తర్వాత కొంతకాలం ఇంటికే పరిమితమైన నిహారిక... నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు నిర్మించారు. ఆ తర్వాత కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించి భారీగా లాభాలను అందుకున్నారు. ఇందుకు గాను గద్దర్ అవార్డ్‌ను సైతం ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిర్మిస్తున్నారు నిహారిక. అయితే మెగా డాటర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు అవి ఫేక్ న్యూస్‌గా నిలిచాయి.
సాయిదుర్గా తేజ్‌కు నిహారిక బర్త్ డే విషెస్
అయితే ఈ వార్తల్లో ఎక్కువగా సాయిథరమ్ తేజ్- నిహారిక చుట్టూనే తిరిగాయి. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని కథనాలు వచ్చాయి. అయితే వీటిని వీరిద్దరూ పలుమార్లు బహిరంగ వేదికలపైనే కొట్టేశారు. తాజాగా అక్టోబర్ 15వ తేదీన సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు కావడంతో తన బావకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నిహారిక. హ్యాపీ బర్త్ డే బావ.. లవ్ యూ అని చెబుతూ సాయితేజ్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేశారు. ఇందులో తన బావ నోటిని మూసేస్తూ నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











