Niharika: 'ఏం జరిగినా ఆ విషయంలో నో కాంప్రమైజ్': మెగా డాటర్ కష్టాలు మామూలుగా లేవుగా

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ వారందరితో చాలా సరదాగా ఉంటుంది. నాగబాబుకు నిహారిక అంటే ప్రాణం. నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తూన్న క్రమంలో నాగబాబు ఢీ షోలో నిహారిక పై ప్రేమను బయటపెట్టాడు. కామన్‌గా అమ్మాయిలంటేను తండ్రులకు ఇష్టమన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఫ‌స్ట్ మూవీ క‌మిటీ కుర్రాళ్లు మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్ వెనుక నిహారిక చాలా క్షష్టాలు పడిందట. తన ఆరోగ్యం బాగ లేకపోయినా మూవీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదంట.

మెగా డాటర్ నిహారిక యాంకర్‌గా, హీరోయిన్ గా, నిర్మాతగా మంచి పేరు దక్కించుకుంది. కథానాయికగా ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మెప్పు పొందింది. నిహారిక నటిగా కెరీర్‌ని కొనసాగించే ముందు బుల్లితెర ప్రముఖ షో అయిన ఢీ జూనియర్ 1 అండ్ ఢీ జూనియర్ 2 విభాగాలకు ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోను హోస్ట్ చేసింది.తర్వాత ఒక మనసు చిత్రంలో నాగశౌర్య సరసన నటించి.. మంచి తన నటనతో తెలుగు ప్రజల వద్ద మార్కులు కొట్టేసింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. తర్వాత ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి, డార్లింగ్, వంటి సినిమాల్లో హీరోయిన్ గా, అతిథి పాత్రలో, హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.

Niharika Konidela debut film Committee Kurrollu as a producer Committee Kurrollu was a success for a number of reasons

మెగా డాటర్ నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా మెరిచింది. ఈ సిరీస్ హాట్ స్టార్ లో మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. ఈ జనరేషన్ యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన డెడ్ పిక్సెల్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. బతికే గేమర్స్ గురించి చూపించడం.. ఇక నిహారిక అందులో అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా ప్రేక్షకులను కట్టిపడేసింది.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో ముద్దపప్పు ఆవకాయ్ అనే సిరీస్ లో నటించడంతో పాటు తానే స్వయంగా నిర్మించింది కూడా.

నిహారిక ప్రస్తుతం నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రొడ్యూసర్‌గా మొదటి సినిమానే ఏకంగా పదకొండు మంది కుర్రాళ్లతో కమిటీ కుర్రాళ్లు సినిమాను నిర్మించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏకంగా కమిటీ కుర్రాళ్లు థియేటర్ లో 50 రోజులు ఆడడం విశేషం. మా నిహారిక నిర్మించిన మూవీ అద్భుతంగా ఉంది. అందరూ వీక్షించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా రివ్యూ ఇచ్చారు. రీసెంట్‌గా 50 రోజుల కార్యక్రమం కూడా నిర్వహించారు.

Niharika Konidela debut film Committee Kurrollu as a producer Committee Kurrollu was a success for a number of reasons

ఈ సందర్భంగా దర్శకుడు యదు వంశీ మాట్లాడారు. కమిటీ కుర్రాళ్లు మూవీ ప్రమోషన్స్ అప్పుడు టీమ్ అంతా కలిసి ఊర్లకు టూర్ వేశామని తెలిపారు. కానీ నిహారిక హెల్త్ అప్పుడు బాలేదని వెల్లడించారు. ఆరోగ్యం బాలేనప్పుడు వీరందరినీ తీసుకెళ్లడం ఎందుకు అని అడిగానని, దీనికి నిహారిక ఇప్పుడు కాకపోతే వీళ్లని ఎవరు తీసుకెళ్తారని అనేవారని డైరెక్ట్ వెల్లడించారు. 10 డేస్ ఒక బస్సు వెనక కారులో ట్రావెల్ చేశామని, నిహారిక బ్యాక్ పెయిన్ తో చాలా బాధపడిందని.. అయినా కూడా వారందర్ని ఎంకరేజ్ చేసిందని పేర్కొన్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమా కోసం, ప్రమోషన్స్ కోసం నిహారిక చాలా కష్టపడిందని దర్శకుడు యదు వంశీ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X