నిహారిక నిశ్చితార్థానికి.. పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదంటే..

దగ్గుబాటి వారి పెళ్లి అనంతరం ఇప్పుడు కొణిదెల వారి పెళ్లి సంబరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం గురువారం రాత్రి సింపుల్ గా ముగించిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. నిహారిక నిశ్చితార్థం ముగియడంతో అందరి దృష్టి పెళ్లి వైవు మళ్ళింది. అంతా బాగానే ఉంది గాని నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెగా దంపతులు కుటుంబ పెద్దగా..

మెగా దంపతులు కుటుంబ పెద్దగా..

గురువారం రాత్రి చైతన్య జొన్నలగడ్డ, నిహారికల నిశ్చితార్థం వేడుకను చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన 50 మంది మాత్రమే హాజరయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కుటుంబ పెద్దలుగా దగ్గరుండి వేడుకను నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ రాకపోవడంతో..

పవన్ కళ్యాణ్ రాకపోవడంతో..

దాదాపు వేడుకకు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ మెగా సిస్టర్స్ కూడా వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కానీ పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు సొంత అన్నయ్య అనే కాదు. జనసేన పార్టీలో ఒక మెంబర్ కూడా అలాంటి అన్నయ్య కూతురి నిశ్చితార్థ వేడుకకు పవన్ హాజరుకాకపోవడానికి కారణం ఏమిటనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

నితిన్ కోసం వెళ్లిన పవన్..

నితిన్ కోసం వెళ్లిన పవన్..

పవన్ కళ్యాణ్ ఇటీవల యువ హీరో నితిన్ పెళ్లి వేడుకలో సడన్ గా ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. మెయిన్ ఫంక్షన్స్ కి వెళ్లకుండా కేవలం పెళ్లి వేడుక కంటే ముందు నితిన్ ని ప్రత్యేకంగా కలుసుకొని విష్ చేసి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ అప్పుడు దీక్షలో ఉన్నట్లు అందరికి ఒక ఒక క్లారిటీ వచ్చేసింది.

దీక్షలో ఉండడం వలన రాలేదట..

దీక్షలో ఉండడం వలన రాలేదట..

నితిన్ కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్యా కూతురి కోసం వెళ్లడా? అని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేదని తెలిసిపోయింది. అయితే ఆయన ప్రస్తుతం దీక్షలో ఉండడం వలనే ఫంక్షన్ కి రాలేదని తెలుస్తోంది. సాయత్రం 6గంటల తరువాత బయటకి వెళ్లకూడదని పవన్ ఒక నియమాన్ని పాటిస్తుండడం వలనే ఎంగేజ్మెంట్ కి హాజరు కాలేదని టాక్ వస్తోంది.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
 విషెస్ అందించిన పవన్?

విషెస్ అందించిన పవన్?

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని నిహారిక అంటే కూడా పవన్ కళ్యాణ్ కి ఎంతో ప్రేమ. చిన్న తనంలో పవన్ బాబాయ్ తో కలిసి చాలా అల్లరి చేశానని తోటి వారిని బాగా ఎడిపించేదాన్ని అని నిహారిక పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. అయితే ఇప్పుడు పవన్ నిహారిక ఫంక్షన్ కి రాకపోయినప్పటికి ఎదో ఒక విధంగా తన బెస్ట్ విషెస్ అందించి ఉంటారనే టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X