Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. తడిసిన చీరలో మెగా డాటర్ అరాచకం!
దాదాపు డజను మందికిపైగా హీరోలతో మెగా ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమను రూల్ చేస్తోంది. ఈ కుటుంబం నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. నాగబాబు గారాలపట్టిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. నటిగా సక్సెస్ కాలేకపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన నిహారిక రూట్ మార్చి నిర్మాతగా అవతారమెత్తి సక్సెస్ కొట్టారు. ప్రొడక్షన్, నిర్మాణంపై అనుభవాన్ని సంపాదిస్తున్న నిహారిక స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందాలని కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
తొలుత ఓ ఛానెల్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక కొణిదెల. అనంతరం యువ హీరో నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసులో సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు మెగా డాటర్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా నటిగా స్థిరపడాలని ఎంతో శ్రమించారు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది. కానీ ఇవేవీ నిహారికను గట్టెక్కించలేకపోయాయి.

చైతన్యతో పెళ్లి, విడాకులు
కెరీర్ గాడితప్పడంతో నిహారిక డైలమాలో పడ్డారు.. ఈ సమయంలోనే ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కానీ కొద్దినెలలకే నిహారిక- చైతన్యల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంది. ఈ పరిణామం సినీ పరిశ్రమకు, మెగా అభిమానులకు షాకిచ్చింది.
డిప్రెషన్‌లోకి నిహారిక
వ్యక్తిగత జీవితం కుదుపులకు గురికావడంతో నిహారిక తేరుకోవడానికి చాలాకాలమే పట్టిందని, ఒకానొక దశలో ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ఆమె ఇబ్బంది పడ్డారని చిత్రసీమలో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ సమయంలో తనను తాను తెలుసుకున్న నిహారిక .. నిర్మాతగా అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించింది నిహారిక.
నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు క్లారిటీ
ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించారు. గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాతో భారీ లాభాలు గడించడంతో పాటు ప్రతిష్టాత్మక గద్ధర్ అవార్డ్‌ను అందుకున్నారు నిహారిక. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తను అనుకున్న విధంగా కెరీర్‌లో స్థిరపడటంతో నిహారికకు రెండో పెళ్లి చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆమె తండ్రి నాగబాబు ఖండించారు. తన బిడ్డ ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉందని.. కానీ తన జీవితంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.
వర్షంలో ఎంజాయ్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక ఎప్పటికప్పుడు తన సినిమాలు, ప్రొడక్షన్ పనులు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిహారిక మాన్‌సూన్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ శారీలో తన ఇంటి టెర్రస్‌పై వర్షం తడుస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











