Niharika Divorce: విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక.. ఏం చెప్పిందో తెలుసా?
ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలోను విడాకులు వ్యవహారం ఎక్కువ అవుతోంది. ఇటీవల మెగా డాటర్ నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ విడాకులు విషయం హాట్ టాపిక్ గా మారింది. వీరు డివోర్సి తీసుకుని సెపరేట్ గా ఉంటున్నారని గత కొంతకాలంగా వార్తలు మారుమోగుతూనే ఉన్నాయి. ఇక జూలై 4న నిహారిక-చైతన్య విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా బయట పడింది. అందుకు సంబంధించిన పేపర్స్ నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడాకులపై స్పందించింది నిహారిక కొణిదెల. ఈ మెగా డాటర్ ఏం చెప్పిందనే మాటల్లోకి వెళితే..
నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్నట్లు గత కొంత కాలంగా మీడియా సంస్థలు కూడై కోసిన విషయం తెలిసిందే. అందుకు కారణం నిహారిక తన ఇన్ స్టా ఖాతాలో చైతన్య ఫొటోలు డిలీట్ చేయడమే. తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ కు చైతన్య రాకపోడవంతో ఈ డివోర్స్ మ్యాటర్ మరింత బలపడింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగెజ్ మెంట్ కి చైతన్య రాకపోవడంపై నెట్టింట్లో తెగ చర్చ జరిగిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మంగళవారం అంటే జూలై 4న నిహారిక-చైతన్య తమ వివాహబంధానికి ముగింపు పలికనట్లు అధికారికంగా వెల్లడైంది. పరస్పర అంగీకారంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. నిహారిక-చైతన్య డివోర్స్ కు అప్లై చేసి నెల రోజులు అవుతుంది. కానీ ఇన్ని రోజులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అంతేకాకుండా విడాకుల కోసం చైతన్యే ముందు దరఖాస్తు పెట్టుకున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక-చైతన్య విడాకుల వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. విడాకులకు కారణాలు, తదితర అంశాలతో మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో విడాకులపై తొలిసారి స్పందించింది నిహారిక కొణిదెల. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది. "చైతన్య నేను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ఈ సున్నిత సమయంలో దయతో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. కొత్తగా ప్రారంభించే జీవితంలో ప్రైవేసి కావాలని కోరుకుంటున్నా. అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నాకు అండగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు కృతజ్ఞతలు" అని నిహారిక తెలిపింది.


Click it and Unblock the Notifications











