అలా నన్ను టార్గెట్ చేస్తున్నారు... ట్రోలింగ్‌పై నిహారిక కొణిదెల దిమ్మతిరిగే కౌంటర్

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అదృష్టం కలిసిరాకపోవడంతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకున్నారు. తొలుత వెబ్ సిరీస్‌లతో సత్తా చాటిన ఆమె ఆ తర్వాత కమిటీ కుర్రోళ్లు మూవీతో వెండితెరపై తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాకాస సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో రాకాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Niharika Konidela Gets Emotional at Rakasa Pre-Release Event Opens Up About Her Journey as Producer

తాజాగా జరిగిన రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ నేను మానసను కలవడానికి ముందు మానస డైలాగ్స్‌ని కలిశాను. యూట్యూబ్‌లో చిన్న సిరీస్ చేశాను.. దానికి మహేశ్ గారు డైరెక్టర్. డైలాగ్స్ చూస్తుంటే కొంచెం కామెడీ ఉంది.. ఆవిడ శ్రీకాకుళానికి చెందినవారు, వైజాగ్‌లో ఉంటారు. డైలాగ్స్ నాకు వాట్సాప్‌లో పంపిస్తారని డైరెక్టర్ గారు చెప్పారు. ఆవిడని ఫస్ట్ టైం చూసి షాకయ్యా.. దుప్పటి కప్పుకున్నట్లుగా డ్రెస్‌తో కవర్ చేసుకుని కనిపించారు. మీరు డైలాగ్స్ రాశారా? అని అడిగాను.. తను తక్కువ మాట్లాడుతుంది, కానీ చాలా డెప్త్. మానసకి సినిమాలు తప్పించి వేరే లోకం తెలియదు.. ఇన్నేళ్లుగా తెలిసినా పెద్దగా మాట్లాడదని నిహారిక తెలిపారు.

వేదిక మీద అందరూ చాలా మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోళ్లు చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం 15 మంది కొత్తవాళ్లను పరిచయం చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా నీకు తెలిసినవాళ్లతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రోళ్లులాగా ఒక మంచి సినిమా చేయొచ్చు కదా.. అందరికీ తెలిసింది. కొత్త కుర్రాళ్లని పెట్టుకుని, యంగ్ కథలు ఏమైనా చేయొచ్చు కదా అన్నారు. మనకి వీఎఫ్ఎక్స్ లాంటివి అవసరమా? చిన్న చిన్న వాళ్లను పెట్టుకోవచ్చు కదా? మళ్లీ మీ ఫ్యామిలీ వాళ్లతో చేస్తున్నావని అంటున్నారు. నేను ఏం చేసినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. నేను చేసేది చేస్తూనే ఉంటానని నిహారిక స్పష్టం చేశారు.

నేను వర్క్ చేసిన ప్రతి సినిమాలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులతో అంతే నేర్చుకుంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీయే సర్వస్వం.. నిహారికను మళ్లీ కొత్తగా పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే. గత కొన్నిరోజులుగా ఒక 70 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాం. రాకాసను ప్రమోట్ చేసే మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, నేను చిన్న యాక్టర్ అవుదామనుకున్నా. చిన్న కథలో ఏదో చేద్దామనుకున్నా.. నా తల్లిదండ్రులు నన్ను నమ్మి ఫ్రీడమ్ ఇచ్చారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇలా ఉందంటే రమేశ్ గారు, మరికొందరి వల్లేనని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X