ఫస్ట్‌లుక్: వరుణ్ తేజ్ సమర్పణలో నిహారిక ‘సూర్యకాంతం’
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తొలి హీరోయిన్ నిహారిక కొణిదెల సెలెక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 'ఒక మనసు' అనే ఒక డిసెంట్ సాఫ్ట్ లవ్ స్టోరీతో తెరంగ్రేటం చేసిన నిహారిక ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలో 'సూర్యకాంతం' సినిమా ద్వారా ఆమె గయ్యాలి క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
గతంలో నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ్' లాంటి వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' తెరకెక్కుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రోజు విడుదల చేయడానికి ఓ ప్రత్యేకత ఉంది. నేడు నిహారిక పుట్టినరోజుతో పాటు సూర్యకాంతం వర్ధంతి కూడా. టైటిల్ చూస్తుంటే సూర్యకాంతం తరహాలో నిహారిక గయ్యాలి క్యారెక్టర్లో కనిపించబోతోందని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బేనర్లో సందీప్ యర్రంశెట్టి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications