Sita Ramam మూవీపై మెగా డాటర్, నాని, రవితేజ రివ్యూ.. సెలబ్రిటీల ఎమోషనల్ పోస్టులు వైరల్

సీతారామం సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ శుక్రవారం విడుదలైన బింబిసార మాస్ హిట్ కాగా.. సీతారామం క్లాస్ హిట్‌గా నిలిచింది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం సీతారామం సినిమాకు ఓట్లేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులతో థియేటర్లో కళకళలాడుతున్నాయి. ఇలా థియేటర్లో హౌస్ ఫుల్ అయి.. సినిమాలకు జనాలు కదిలి రావడం చాలా రోజులైంది.అసలే థియేటర్లకు జనాలు రావడం లేదని ఇండస్ట్రీ జనాలు గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు మంచి చిత్రాలు పడటంతో జనాలు ఇంట్లోంచి కదులుతున్నారు. థియేటర్లో సందడి చేస్తున్నారు. సీతారామం సినిమా ఇటు ఇండస్ట్రీ జనాలను, అటు సాధారణ ప్రేక్షకులనూ కదిలిస్తోంది.

కల్ట్ క్లాసిక్..

కల్ట్ క్లాసిక్..

సీతారామం సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయేట్టుగా ఉంది. హను రాఘవపూడి టేకింగ్.. మాటలు, పాటలు అన్నీ కూడా ఓ కవిత్వంలా అనిపిస్తుంది. సినిమా అంతా కూడా అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తుంది. కాశ్మీర్ అందాలను ఈ సినిమాకు హైలెట్ అవుతాయి. ఇక దుల్కర్, మృణాల్ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అన్ని కోణాల్లో ఈ సినిమా ది బెస్ట్ అని టాక్ సంపాదించుకుంది.

నాని రియాక్షన్..


సీతారామం సినిమాను వీక్షించిన నాని స్పెల్ బౌండ్ అయినట్టున్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించాడు. దుల్కర్ సల్మాన్‌కు ఓ రెండ్ హార్ట్ సింబల్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్‌కు ఒక హార్ట్.. హను రాఘవపూడికి మూడు హార్ట్ సింబల్స్.. సీతారామం సినిమాకు ఐదు హార్ట్ సింబల్స్ ఇచ్చాడు.. క్లాసిక్ పీరియడ్.. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి అని నాని దండం పెట్టేశాడు.

రవితేజ ట్వీట్..


ఇప్పుడు సీతారామం సినిమా చూశాను.. దుల్కర్, మృణాళిని నటనను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.. హను రాఘవపూడి, విశాల్ చంద్రశేఖర్, స్వప్నా దత్ ఇలా అందరూ కలిసి మ్యాజిక్ చేసేశారు.. టీం అందరికీ కంగ్రాట్స్.. ఈ క్లాసిక్ సినిమాను థియేటర్లో చూడటం మిస్ అవ్వకండి అని రవితేజ ట్వీట్ వేశాడు.

నిహారిక ఎమోషనల్..

నిహారిక ఎమోషనల్..


సీతారామం సినిమాతో ప్రేమలో పడిపోయాను.. ఆ విజువల్స్ ఇంకా వెంటాడుతున్నాయి.. ప్రేమలోని తీయదనం అద్భుతం.. అద్భుతమైన నటన.. ఆ మ్యూజిక్.. కథను చెప్పిన విధానం.. అన్నీ కూడా అద్భుతమే.. ఎన్నో రోజుల తరువాత థియేటర్లో చూడదగ్గ చిత్రం వచ్చింది.. టీం అందరికీ కంగ్రాట్స్.. ఈ సినిమా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు.. ఈ ప్రశంసలకు మీరు అర్హులే.. ప్రొడక్షన్ డిజైన్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంటూ నిహారిక కొణిదెల ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X