హాట్ టాపిక్‌గా నిహారిక ప్రత్యేక పూజలు.. ఆ చోటుకే మెగా డాటర్ ఎందుకు?
మనం ఎంత శ్రమించినా అదృష్టం అనేది తోడు లేకుంటే కొన్నిసార్లు విజయం సాధించలేం. చేసే పనిలో సక్సెస్ కోసం భగవంతుడి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా కావాలి. ఇటీవలి కాలంలో అన్ని వయసులో వారిలో ముఖ్యంగా యువతలో దైవ చింతన, ఆధ్యాత్మికత బాగా పెరుగుతోంది. ఆలయాలకు వెళ్లడం, హోమాలు, ఉపవాసాలు, దీక్షలు అంటూ యువత సనాతన ధర్మం వైపు పరుగులు తీస్తున్నారు. బిజీ లైఫ్‌లో వారికి ఒత్తిడిని దూరం చేయడంతో పాటు దైవానికి దగ్గరగా ఉండటం బాగా అలవాటు అవుతోంది. సామాన్యులే కాదే సెలబ్రెటీలు కూడా ఈ మధ్యకాలంలో ప్రత్యేక పూజలు, దీక్షలు తీసుకుంటున్నారు.
మాలలో చిరు, చరణ్
మన సినీనటుల్ని కొందరిని పరిశీలిస్తే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు అయ్యప్పమాల, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటూ మాలలో కనిపిస్తారు. ఇక నందమూరి బాలకృష్ణ ఇంట్లోనే పూజలు చేసినా కఠిన నియమాలు పాటిస్తారు. మరో మెగా హీరో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు తోడుండాలని అనుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పదేళ్లు పోరాడినా ఎమ్మెల్యే కాలేకపోవడం, జనసేన పరిస్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటంతో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని అనుకున్నారు.

వారాహీ అమ్మవారిని నమ్ముకున్న పవన్
2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆయన వారాహీ అమ్మవారి దీక్ష స్వీకరించారు. తన ప్రచార రథానికి వారాహీ అమ్మవారి పేరు పెట్టుకున్నారు. తన కష్టానికి అమ్మవారి ఆశీస్సులు తోడు కావడంతో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ఆయన భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాలు, పాలనతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాటలోనే నడుస్తున్నారు.
వేణుస్వామి వద్దకు హీరోయిన్ల క్యూ
ఇక కెరీర్‌లో వెనుకబడిన నటీనటులకు ముఖ్యంగా హీరోయిన్లతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేయించే తాంత్రిక పూజల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో పూజలు చేయించుకున్న హీరోయిన్లు టాప్ పొజిషన్‌కు వెళ్లడంతో వేణుస్వామి ఇంటి ముందు సెలబ్రెటీలు క్యూకడుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు వేణుస్వామితో పూజలు చేయించుకోవడం, అసోంలోని కామాఖ్య దేవి ఆలయంలో ప్రత్యక్షం కావడం చూస్తూనే ఉన్నాం.
నటిగా ఫెయిలైన నిహారిక
తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. బలమైన కుటుంబం నుంచి వచ్చినా ఎందుకు ఈ ముద్దుగుమ్మకు నటిగా అంత గుర్తింపు దక్కలేదు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సక్సెస్ కాలేకపోయారు నిహారిక. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు పడింది ఈ అమ్మాయి. సిద్ధూ జొన్నలగడ్డతో పెళ్లయి కొద్దినెలలు గడిచేసరికి ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇది మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులను సైతం నిరాశకు గురిచేసింది.
చండీ హోమం జరిపించిన నిహారిక
నటిగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నిర్మాతగా నిహారిక దూసుకెళ్తున్నారు. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ఘన విజయం సాధించడంతో నిహారిక మంచి జోష్‌లో ఉన్నారు. తన హిట్ ట్రాక్ ఇలాగే కంటిన్యూ చేయాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆమె భావిస్తున్నారు. ఇందుకు భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్న నిహారిక తన నిర్మాణ సంస్ధ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధాంతులు, వేద పండితులతో చండీ హోమం నిర్వహించింది. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక ఇలా పూజలు నిర్వహించడానికి కారణం ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











