సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేయడానికి కారణం : నిహారిక సంచలన వ్యాఖ్యలు
మెగా కుటుంబంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఎప్పటి నుంచో బన్నీ తీరు వివాదాస్పదమవుతుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరిందని అంటున్నారు. ' చెప్పను బ్రదర్ ' ఇన్సిడెంట్ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్‌తో అల్లు అర్జున్‌కి సంబంధాలు అంతగా బాలేదని ఫిలింనగర్ టాక్. ఎన్ని గొడవలున్నప్పటికీ వాటిని పక్కనబెట్టి.. పవన్‌కు మిగిలిన మెగా హీరోల మాదిరిగా వెన్నుదన్నుగా నిలబడలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
జనసేనానికి కానీ ఆయన మద్ధతు పలికిన కూటమి కోసం అల్లు అర్జున్ నోరు విప్పలేదు. పవన్ - చంద్రబాబులకు బద్ధ శత్రువు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి కొద్దిగంటల్లో సమయం ముగుస్తుందనగా నంద్యాలలో భార్య స్నేహారెడ్డితో ల్యాండైన అల్లు అర్జున్.. శిల్పా రవిని గెలిపించాలని కోరారు. బన్నీ ప్రచారం చేసినప్పటికీ ఫలితాల రోజున శిల్పా రవిచంద్ర ఓటమి పాలయ్యారు.

పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్దా విజయవాడ తరలివెళ్లారు. ఈ బ్యాచ్‌లోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు. ఎన్నికల్లో ఘన విజయం, ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సెలబ్రేషన్స్ పార్టీకి అల్లు అర్జున్ కుటుంబానికి ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ టాక్.
ఈ పరిణామాల నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బన్నీని ఇకపై తాము ఎలా ట్రీట్ చేస్తామో సాయితేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరికలు పంపిందా .. లేక జరుగుతున్న పరిణామాలతో విసుగుపుట్టి మెగా మేనల్లుడే ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియరాలేదు. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయితేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా డిస్ట్రబ్ చేశాడోనని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇక సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంపై మెగా డాటర్ నిహారికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఓటీటీ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ వచ్చారు. తాజాగా పింక్ ఎలిమెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక, ఫణి నిర్మాతలుగా యదు వంశీ దర్శకత్వంలో 'కమిటీ కుర్రొళ్లు ' అనే మూవీ తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్, సాంగ్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తా జాగా కమిటీ కుర్రొళ్లు టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడగా.. విలేకరులు అల్లు అర్జున్ , సాయిధరమ్ తేజ్ ఇష్యూని ప్రస్తావించారు. బన్నీని సాయితేజ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసిన విషయం తనకు తెలియదని, అయితే ఎవరికి కారణాలు వారికి ఉంటాయని నిహారిక వ్యాఖ్యానిస్తూ తెలివిగా తప్పించుకున్నారు. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











