యాక్టింగ్‌కి నిహారిక కొణిదెల గుడ్‌బై.. దిమ్మతిరిగేలా మెగా డాటర్ రిప్లయ్

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టిగా వెండితెరపై అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. అయితే నటిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా స్థిరపడ్డారు నిహారిక. పించ్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రస్తుతం సినిమాల నిర్మాణంలో ఆమె బిజీగా ఉన్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన రాకాస విడుదలకు సిద్ధం కాగా.. తన సోదరుడు వరుణ్ తేజ్‌తో బరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే నిర్మాతగా స్థిరపడి.. యాక్టింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికినట్లేనా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నిహారిక. ఈ వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ హోస్ట్‌గా కెరీర్ ప్రారంభం
2015లో ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్స్‌ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక కొణిదెల.. ఆ తర్వాతి సంవత్సరం ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి, డార్లింగ్, చిత్రాలలో నటించారు. అప్పటికే తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించిన నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు.

Niharika Konidela Reacts Strongly on quitting Acting Career Rumors at Rakasa Promotions

ఏప్రిల్ 3న రాకాస
కమిటీ కుర్రోళ్లు చిత్రంతో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన నిహారిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే రాకాసకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. గుడ్ ఫ్రైడే కానుకగా ఏప్రిల్ 3వ తేదీన రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

వరుణ్‌తేజ్‌తో నిహారిక సినిమా
రాకాసను విడుదలకు సిద్ధం చేసిన నిహారిక.. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా బరి అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌ని ఆశీర్వదించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

యాక్టింగ్‌కు నిహారిక గుడ్ బై
ప్రస్తుతం రాకాస మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో నిహారిక బిజీగా ఉన్నారు. కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ మొదలు కానుండగా.. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మీరు నిర్మాతగా సెటిలైపోతారా? యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పినట్లేనా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. మీ ముఖంలో ఆ నవ్వేంటీ సార్ అంటూ నిహారిక సీరియస్ అయ్యారు. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పను, చేస్తానని తేల్చేశారు.

జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తా
సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్‌గానే ఉండాలి. ఒకటి హిట్ అయ్యింది కదా అని ఒక ప్యాట్రన్‌‌లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్లకూడదు. నేను మా పెదనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీమంజునాథ వస్తుంది, ఒకసారి ముఠామేస్త్రీ వస్తుంది, ఠాగూర్ వస్తుంది. సినిమాలు డిఫరెంట్‌గా ఉండాలి, జనాన్ని ఎంటర్‌టైన్ చేయాలని నిహారిక తెలిపారు. కమిటీ కుర్రోళ్లు అయిపోయిన తర్వాత డిఫరెంట్ జోనర్‌లోనే చేయాలని అనుకున్నానని నిహారిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: niharika konidela Rakasa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X