For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా డాటర్ నిహారిక మూవీలో ఆ సీన్ చూసి షాక్, ఎవరూ ఊహించలేదు.. (సూర్యకాంతం టీజర్)

    |

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక కొణిదెల తన ఫ్యామిలీ ఇమేజ్, ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తన చుట్టూ గిరిగీసుకుని ఇలాంటి సినిమాలు మాత్రమే చేయాలి, ఇంతకు మించి లిమిట్స్ దాటకూడదను అని కొన్ని రూల్స్ పెట్టుకున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ఆమె సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

    అయితే నిహారిక ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు... ఇప్పుడు చేస్తున్న సినిమా మరో ఎత్తు అనేలా ఉండబోతోందా? అంటే అవునే అనే అంటున్నారు 'సూర్యకాంతం' టీజర్ చూసిన సినీ ప్రేమికులు.

    ఫుట్ బాల్ ప్లేయర్‌గా

    ఫుట్ బాల్ ప్లేయర్‌గా

    ఈ చిత్రంలో నిహారిక సూర్యకాంతం అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఫుట్ బాల్ ప్లేయర్‌గా టైటిల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా గయ్యాలిగా ఆమె కనిపించబోతోందని స్పష్టమవుతోంది.

    గీత దాటిందా...? ఎవరూ ఊహించలేదు

    గీత దాటిందా...? ఎవరూ ఊహించలేదు

    అయితే నిహారిక ఇప్పటి వరకు తన చుట్టూ గీసుకున్న గీతను కాస్తదాటి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. టీజర్లో Fu*k life అనే సీన్ చూపడం ద్వారా ఆమె క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. నిహారిక సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని ఊహించని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా సినిమా ఉండాలంటే ఇలాంటి డేరింగ్ స్టెప్స్ వేయక తప్పదు అనే వారూ లేకపోలేదు.

    సూర్యకాంతం

    గతంలో నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ్' లాంటి వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' తెరకెక్కుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

    వరుణ్ తేజ్ సమర్పణలో

    వరుణ్ తేజ్ సమర్పణలో

    వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బేనర్లో సందీప్ యర్రంశెట్టి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Niharika Konidela and Rahul Vijay First teaser of Telugu film SuryaKantham releasd. Directed by Pranith Bramandapally, Produced by Nirvana Cinemas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X