నిహారిక రెండో పెళ్లి.. డైవోర్స్‌కు కారణం అదే.. నాగబాబు క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి రెండో సోదరుడు నాగబాబు అన్న అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలుత హీరో కావాలని అనుకున్నప్పటికీ డెస్టినీ ఆయనను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా మార్చింది. ఆపై అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు నాగబాబు. తన వారసులుగా వరుణ్ తేజ్, నిహారిక కొణిదెలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు.
వారసులను దించిన నాగబాబు
వరుణ్ తేజ్ హీరోగా సెటిలవ్వగా.. నిహారిక తనకు నటన అచ్చిరాదని గ్రహించి నిర్మాణం వైపు అడుగులు వేశారు. వరుణ్ తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. త్వరలో వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. అయితే నిహారిక కెరీర్ పరంగా ట్రాక్‌లోకి వచ్చారు.. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉండటంతో మెగా ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కూతురి జీవితాన్ని నిలబెట్టాలని నాగబాబు ప్రయత్నిస్తున్నారు.

చైతన్యతో విడాకులు
ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించారు నిహారిక కొణిదెల. అనంతరం నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసులో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలలోనూ, పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. కానీ అక్కడా ఆమెను దురదృష్టం వెంటాడింది. కెరీర్‌లో నిలదొక్కుకోకముందే నిహారికను చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిపించారు పెద్దలు. కానీ కొద్దినెలలకే ఈ జంట విడాకులు తీసుకుని సినీ పరిశ్రమకు, మెగా అభిమానులకు షాకిచ్చింది.
నిర్మాతగా స్థిరపడిన నిహారిక
విడాకుల తర్వాత కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన నిహారిక ఆ తర్వాత నిర్మాతగా అవతారమెత్తారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించారు. గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాతో భారీ విజయంతో పాటు గద్ధర్ అవార్డ్‌ను అందుకున్నారు నిహారిక. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను మెగా డాటర్ నిర్మిస్తున్నారు. కెరీర్ పరంగా సెటిల్ కావడంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
నిహారిక విడాకులపై నాగబాబు రియాక్షన్
ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. పిల్లల కెరీర్ విషయంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. వారి సినిమాలు హిట్టయినా, ఫ్లాపయినా తనకు అనవసరమని.. వారి సంతోషమే నాకు ముఖ్యమన్నారు. లావణ్యతో వరుణ్ బాబు జీవితం పంచుకోవడంపై ఎంతో ఆలోచించి అతనిని సంప్రదించిన తర్వాతే ఇద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నాగబాబు స్పష్టం చేశారు. అయితే చైతన్యతో నిహారిక పెళ్లి విషయంలో తన నిర్ణయం తప్పిందని.. అలాగని ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేయలేదన్నారు. కానీ నిహారిక- చైతన్యలు ఒకరికొకరు సర్దుబాటు చేసుకోలేకపోయారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ కలిసి ఉండాలని అనుకోలేదు.. వారి నిర్ణయాన్ని గౌరవించానని పేర్కొన్నారు.
నిహారిక పెళ్లిపై క్లారిటీ
నిహారిక రెండో పెళ్లిపై మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావించగా నాగబాబు స్పందించారు. తన బిడ్డ ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉందని.. కానీ తన జీవితంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటుందని మెగా బ్రదర్ హింట్ ఇచ్చారు. అయినా ఆమె జీవితం, ఆమె ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిహారిక పెళ్లి చేసుకోవాలని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











