తక్కువ చేసి మాట్లాడితే..జనమే బుద్ది చెప్పేలా ఉన్నారు.. నిహారిక కొణిదెల సెన్సేషనల్ కామెంట్స్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన వస్తున్నది.ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి విశేషాలు, నిహారిక స్పందన వివరాల్లోకి వెళితే..

కమిటీ కుర్రాళ్లు సినిమా అంతా కొత్తవారితోనే నిర్మించారు. కథ, కథనాలే హీరోగా సినిమాను నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించారు. ఈ సినిమా చూసిన తర్వాత నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌పై మంచి రెస్పాన్స్ వస్తున్నది. సినిమాటోగ్రఫి, లైటింగ్, ఇతర సాంకేతిక విభాగాల పనీతీరు గురించి గుడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సౌండింగ్, పాటలు, విజయ్ మాస్టర్ ఫైట్స్, ఇతర అంశాలు హైలెట్ అని చెబుతున్నారు.

Niharika Konidela sensible reaction at Committee Kurrollu success meet

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా చేయడంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి.దాంతో ఈ సినిమా మౌత్ స్ప్రెడ్ కావడంతో వీకెండ్ షోలు భారీగా ఫుల్స్ అవుతున్నాయి. గోదావరి జిల్లాలో మంచి రెవెన్యూ కూడా నమోదు అవుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో చిత్రం యూనిట్ వర్గాలు హ్యాపీగా ఫీలయ్యారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. 'మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా చిత్రాన్ని రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు థాంక్స్. అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం అని అన్నారు.

Niharika Konidela sensible reaction at Committee Kurrollu success meet
నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X