Niharika Konidela: జీవితంలో అదే పెద్ద లోటు... నిహారిక కొణిదెల ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. బుల్లితెర హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడా అదృష్టం కలిసిరాకపోవడంతో నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు నిర్మించి సత్తా చాటారు. కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించి తొలి ప్రయత్నంలోనే విజయం అందుకన్నారు. కలెక్షన్స్‌తో పాటు అవార్డులు సైతం అందుకున్నారు. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇకపై వరుసగా సినిమాలు నిర్మించాలని నిహారిక నిర్ణయించుకున్నారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.

Niharika Konidela Shocking comments on her college life at Rakasa Second Single launch

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పాటలను వదులుతున్నారు. తాజాగా రాకాస నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. పదే పదే ప్రాణం నిన్నే కోరగా అంటూ సాగే ఈ పాటను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో నిహారిక కొణిదెల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గొంతు సరిగా లేకపోయినప్పటికీ అభిమానుల కోసం ఆమో ఓపిక తెచ్చుకుని మాట్లాడారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ పెట్టుకుని ఉంటే బెటర్‌గా ఉండేదేమో. ఇంత పెద్ద అరెంజ్‌మెంట్ నేను కూడా చేయలేను. ఇది కాలేజ్ ఈవెంట్‌లో లేదు.. మూవీ ఈవెంట్‌లా ఉంది. అయితే నాకు కొంచెం బాధగా ఉంది. నేను కూడా ఇలాంటి కాలేజీలో చదివి ఉంటే నాకు కూడా ఇంత గ్రాండియర్‌గా ఫెస్ట్ జరిగేది. అందుకే నేను ఈ పీటర్ కాలేజీలో భాగమనే అనుకుంటున్నా. మా రెండు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పదే పదే ప్రాణం సాంగ్ నా ఫేవరేట్. ఎందుకంటే చాలా ఫిమేల్ సైడ్ సాంగ్స్ వినుంటాం మనం. ప్రతి పాటలోనూ హీరోయిన్‌.. హీరోని ఆడుక్కోవడమే సరిపోతుంది. నాకు ప్రేమ ఇవ్వు.. నాకు ప్రేమ ఇవ్వు అని, అలాంటిది నాకు ఇష్టం ఉండదు. ప్రేమను ఎందుకు అడుక్కోవాలి.. ప్రేమను ఫీల్ అవ్వాలి. అదే పదే పదే ప్రాణం పాటలో పెట్టామని నిహారిక పేర్కొన్నారు.

ఏప్రిల్ 3న మీరందరూ రాకాసను థియేటర్‌లోనే చూడండి. ఇందులో ఫాంటసీ, అడ్వెంచర్, చాలా చాలా కామెడీ ఉన్నాయి. ఫ్యామిలీ అంతా చూసే సినిమా, ఫ్రెండ్స్ అందరూ చూసే సినిమా, చిన్న పిల్లలు.. పెద్దవాళ్లు అందరూ చూసే సినిమా. నాకు మీ కాలేజీలో ఈ ఫెస్ట్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. పదే పదే సాంగ్‌ని సెలబ్రెట్ చేసుకున్నాం. మళ్లీ అవకాశం ఉంటే ఖచ్చితంగా సెయింట్ పీటర్స్‌లో ఏదో ఒక ఈవెంట్ పెడతామని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X