నాకో పెద్ద హృదయం కావాలి.. గత జన్మలో నా కొడుకువి.. మెగా డాటర్ ఎమోషనల్ విషెస్
తండ్రీ కూతుళ్ల అనుబంధానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తారు మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక కొణిదెల. వీరిద్దరు కలిసి చేసే అల్లరి గురించి అప్పుడప్పుడు బయటకు వస్తుంది కూడా. తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిహారిక. కూతురు కోసం ఏదైనా చేసేందుకు రెడీ అంటాడు నాగబాబు.

కూతురు కోరిక మేరకు వెబ్ సిరీస్..
నాగబాబు నటనలో వంక పెట్టడానికి లేనటువంటి ఆర్టిస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. తన మార్క్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అలాంటి నాగబాబు.. కూతురు కోసం, కూతురితో కలిసి నాన్నకూచి అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. అది బాగానే వర్కౌట్ అయింది.

వెండితెరపై రాణించని కూతురు..
బుల్లితెరను అవలీలగా ఏలిన మెగా డాటర్ నిహారిక కొణిదెల.. వెండితెరపై మెరవలేకపోతోంది. ఢీ, జబర్దస్త్ స్టేజ్‌పై దుమ్ము దులిపే నిహారిక.. వెండితెరపై ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేయలేకపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.

విషెస్ తెలిపిన మెగా మేనళ్లుడు..
నేడు (అక్టోబర్ 29) మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్యూ సో మచ్ మామ అంటూ తన ప్రేమను తెలియజేశాడు.
ఎమోషనల్ అవుతూ విషెస్..
తన తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ఐ లవ్యూ సో మచ్ నాన్న.. నీపై నాకు ఉన్న ప్రేమను దాచాలంటే నాకో పెద్ద హృదయం కావాలి.. నువ్వు నవ్వించినంతగా నన్నెవరూ నవ్వించలేరు.. నువ్వు కోటిలో ఒక్కడివి.. నువ్వు గత జన్మలో కచ్చితంగా నా కొడుకువి అంటూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది.


Click it and Unblock the Notifications











