Just In
- 27 min ago
RRR యూనిట్‌పై రాజమౌళి ఫైర్.. ఎన్టీఆర్ కారణంగా ఫుల్ సీరియస్!
- 1 hr ago
సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ.. ఊరికే లింకులు పెడతారు కదా! అందుకే అంటూ ఓపెన్
- 11 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 12 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
Don't Miss!
- Finance
నోట్ల రద్దు వల్ల లాభాలిదిగో.. రూ.3,04,605 కోట్లు నగదును తగ్గించింది
- News
అమరావతి...కాదంటే అక్కడే: రాజధానిపై అత్యధికుల మనోగతం: రాయలసీమలో ఇలా..!
- Sports
దక్షిణాసియా క్రీడల్లో టాప్ లేపిన భారత్.. రికార్డు స్థాయిలో 312 పతకాలు!!
- Lifestyle
బుధవారం మీ రాశిఫలాలు 11-12-2019
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
నాకో పెద్ద హృదయం కావాలి.. గత జన్మలో నా కొడుకువి.. మెగా డాటర్ ఎమోషనల్ విషెస్
తండ్రీ కూతుళ్ల అనుబంధానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తారు మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక కొణిదెల. వీరిద్దరు కలిసి చేసే అల్లరి గురించి అప్పుడప్పుడు బయటకు వస్తుంది కూడా. తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిహారిక. కూతురు కోసం ఏదైనా చేసేందుకు రెడీ అంటాడు నాగబాబు.

కూతురు కోరిక మేరకు వెబ్ సిరీస్..
నాగబాబు నటనలో వంక పెట్టడానికి లేనటువంటి ఆర్టిస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. తన మార్క్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అలాంటి నాగబాబు.. కూతురు కోసం, కూతురితో కలిసి నాన్నకూచి అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. అది బాగానే వర్కౌట్ అయింది.

వెండితెరపై రాణించని కూతురు..
బుల్లితెరను అవలీలగా ఏలిన మెగా డాటర్ నిహారిక కొణిదెల.. వెండితెరపై మెరవలేకపోతోంది. ఢీ, జబర్దస్త్ స్టేజ్‌పై దుమ్ము దులిపే నిహారిక.. వెండితెరపై ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేయలేకపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది.

విషెస్ తెలిపిన మెగా మేనళ్లుడు..
నేడు (అక్టోబర్ 29) మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్యూ సో మచ్ మామ అంటూ తన ప్రేమను తెలియజేశాడు.
|
ఎమోషనల్ అవుతూ విషెస్..
తన తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ఐ లవ్యూ సో మచ్ నాన్న.. నీపై నాకు ఉన్న ప్రేమను దాచాలంటే నాకో పెద్ద హృదయం కావాలి.. నువ్వు నవ్వించినంతగా నన్నెవరూ నవ్వించలేరు.. నువ్వు కోటిలో ఒక్కడివి.. నువ్వు గత జన్మలో కచ్చితంగా నా కొడుకువి అంటూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది.