ఆ యువ హీరతో మళ్ళీ సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నిహారిక.. కపుల్స్ విడిపోయే కథలోనే..
మెగా డాటర్ నిహారిక పేరు ఇటీవల కాలంలో కొన్ని ఊహించని వార్తలలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని గాసిప్స్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఆమె పెద్దగా క్లారిటీ ఇవ్వకుండా తన స్టైల్ లో ముందుకు సాగుతోంది. అయితే చాలాకాలం తర్వాత నిహారిక ఒకసారి సరికొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది కూడా భార్యాభర్తల మధ్య గొడవలుతో సాగే కథ అని తెలుస్తోంది. ఇక ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
మెగా డాటర్ గా మంచి క్రేజ్ : కొణిదెల నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అల్లరి కూతురిగా.. మెగా డాటర్ గా నిహారిక మంచి పేరునే సంపాదించుకుంది. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించింది.

ఊహించని గాసిప్స్ : అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. కానీ ఇటీవలే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే గతంలో నిహారిక ఓ తమిళ హీరోతో రొమాంటిక్ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ఆమె నిశ్చితార్థం, వివాహం జరిగాయి. దీంతో ఆమెను ఆ సినిమా నుంచి తొలగించినట్లు తెలిసింది.
హఠాత్తుగా గ్లామర్ షో : ఆ తర్వాత సైరా చిత్రంలో కనిపించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా కేవలం అతిథి పాత్రలు మాత్రమే చేసింది తప్ప ఎలాంటి లీడ్ రోల్ లో కనిపించలేదు. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియా వేధికగా గ్లామర్ షో చేస్తుంది. తనకు సంబంధించిన అన్ని ఫొటోలను నెట్టింట పెడుతూ తెగ సందడి చేస్తోంది. అయితే చిత్రాల్లో అవకాశాల కోసమే నిహారిక గ్లామర్ షో చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

భార్య భర్తల మధ్య సాగే గొడవలు : ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని 30 సినిమాలో ఈ క్యూట్ బ్యూటీ కనిపించబోతుందని అంతా అంటున్నారు. ఈ సినిమా కథ భార్య భర్తల మధ్య సాగే గొడవలు నేపథ్యంలో ఉంటుందట. ఇక నిహారిక ఒక ఆఫీస్ లో నాని ఫ్రెండ్ పాత్రలో నటిస్తుందట. అయితే ఇది నిజమా కాదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే దీని గురించి అటు చిత్రబృందం కానీ ఇటు నిహారిక కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
డైరెక్టర్ ఛాయిస్ : కానీ నాని సినిమాలో ఓ కీలక పాత్రలో నిహారిక నటించబోతుందని సమాచారం. నాని 30వ చిత్రానికి నూతన డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించబోతున్నారు. డైరెక్టర్ శౌర్యువ్ యే నిహారిక తన సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారట. ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. నానికి స్నేహితురాలిగా నిహారిక.. కథను మార్చే పాత్రలు కనిపిస్తుందట. ఈ చిత్రంలో నాని పక్కన సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదండోయ్ ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులకు ఏకంగా 35 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











