Ram Charan: రామ్ చరణ్ గొప్పతనం అదే.. స్టేజ్ పై మెగా డాటర్ ఎమోషనల్..

HBD Ram Charan: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా కంపౌండ్ లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన ప్రతిభతో 'గ్లోబల్ స్టార్'గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇక నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మెగా డాటర్ నిహారిక కొణిదెలా (Niharika Konidela)చేసిన ఎమోషన్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి వేడుకే అభిమానులకు పండుగలాంటిదే. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు.. 2007లో 'చిరుత'తో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తన డ్యాన్స్, యాక్షన్ తో మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత 'మగధీర'సినిమాతో కెరీర్ మలుపుతిప్పుకుని టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. కొన్ని ఫ్లాప్‌లు వచ్చినా వెనకడుగు వేయని చరణ్, 'రంగస్థలం' సినిమాలో 'చిట్టిబాబు'గా అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఇక RRRలో అల్లూరి సీతారామరాజుగా తన పర్ఫార్మెన్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

Niharika Konidela s Emotional Speech on Ram Charan Goes Viral on His Birthday

'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం ఆయన గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పెంచింది. సినిమాలే కాకుండా కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తారు చరణ్. భార్య ఉపాసన తో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను, అటు పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమాలో నటిస్తున్న చరణ్, వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండే చరణ్, తన పుట్టినరోజును సేవా దినోత్సవంగా మార్చడం ప్రత్యేకం. వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రయాణం నిజంగా స్పూర్తిదాయకమే అని చెప్పాలి.

ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు మెగా ఫ్యాన్స్ కు వేడుకగా మారిపోయింది. ఈ వేడుకల్లో మెగా డాటర్ నిహారిక మాట్లాడుతూ..రామ్ చరణ్ వ్యక్తిత్వంలోని అసలు గొప్పతనాన్ని హైలైట్ చేశారు. ఒక చెల్లెలిగా అన్నపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆమె వ్యక్తపరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. 'అన్నయ్య తన జీవితంలో ఉన్న ప్రతి మహిళను ఎంతో గౌరవంగా చూస్తాడు. అక్కలను చెల్లెల్లా, చెల్లెల్లను కూతుర్లా, కూతుర్ని అమ్మలా, అమ్మను దేవతలా భావిస్తాడు' అంటూ ఆమె చెప్పిన మాటలు అక్కడున్న వారిని కదిలించాయి. చరణ్‌లోని ఈ విలువలే ఆయనను గొప్ప వ్యక్తిగా నిలబెడుతున్నాయని నిహారిక పేర్కొన్నారు.

అంతేకాకుండా, చరణ్ కష్టపడే తీరు గురించి కూడా ఆమె ప్రస్తావించారు. 'ప్రతి సినిమా కోసం ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అభిమానులు గర్వపడేలా ఉండాలని ప్రతి ప్రాజెక్ట్‌కి ప్రాణం పెట్టి పనిచేస్తాడు' అంటూ అన్నపై గర్వం వ్యక్తం చేశారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ఒక మనిషిగా కూడా చరణ్ ప్రత్యేకమైన వ్యక్తి అని ఆమె అన్నారు. 'చరణన్న నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే... ఆడపిల్లలను గౌరవించడం. ఒక అమ్మాయి పక్కన చరణ్ ఫ్యాన్ ఉంటే ఆమెకు భయం ఉండకూడదు' అంటూ పిలునిచ్చారు. ఆమె మాటలు కేవలం కుటుంబ భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాకుండా, మహిళల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X