మొదటి రోజు సందడే సందడి.. సెట్‌లో నిఖిల్-అనుపమ రచ్చ
మొత్తానికి టాలీవుడ్‌లో మళ్లీ పూర్వ వైభవం వచ్చేసింది. చకచకా ప్రాజెక్ట్‌లు మొదలవుతున్నాయి. హీరోలందరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కొందరు విదేశాలు, పక్కరాష్ట్రాలకు వెళ్లి షూటింగ్‌లు చేస్తున్నారు. ఇంకొందరు ఇక్కడే మన రాష్ట్రంలోనే అక్కడక్కడా తిరుగుతూ మంచి మంచి లొకేషన్లను పట్టేసుకుంటున్నారు. ఇలా మొత్తానికి అందరూ బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కూడా తన తదుపరి సినిమాను మొదలెట్టేశాడు.
గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న 18 Pages అనే చిత్రం షూటింగ్ నేడు ప్రారంభించారు. ఇక యూనిట్ అంతా తెగ సందడి చేసేసింది. రెండ్రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన అనుపమ కూడా సెట్‌లోకి అడుగుపెట్టేసింది. హీరో, హీరోయిన్లు మొదటి రోజే రచ్చ రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు యూనిట్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇలా ఫస్ట్ డే ఫుల్ ఎంటర్టైనింగ్‌గా గడిచినట్టు తెలుస్తోంది.

మొదటి రోజే హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. కుమార్ 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల తరువాత మళ్లీ అనుపమ ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ సారైనా ఆమెకు అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. నిఖిల్ ఈ చిత్రంతో పాటు మరో రెండు లైన్‌లో పెట్టాడు. అందులో కార్తికేయ సీక్వెల్ ఆల్రెడీ ప్రారంభించేశాడు. ఇంకొంకటి చర్చల దశలోనే ఉన్నట్టుంది.


Click it and Unblock the Notifications











