twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీస్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. రియల్ హీరో.. నిఖిల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

    |

    కరోనా కట్టడికి ప్రపంచమంతా ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా.. కరోనా మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అయితే కరోనా అరికట్టేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

    21 రోజుల లాక్ డౌన్..

    21 రోజుల లాక్ డౌన్..


    ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించి.. ప్రజలంతా ఇంటికి పరిమితం కావాలని కోరాడు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. రోడ్లపైకి ఎవ్వరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

    పోలీసుల భిన్న స్వరాలు..

    పోలీసుల భిన్న స్వరాలు..

    లాక్ డౌన్ సమయంలో పోలీసుల చర్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసుల పనితనాన్ని, వారి గొప్పతనాన్ని, త్యాగాన్ని కీర్తిస్తుంటే.. మరికొందరు వారి హింసాత్మక చర్యను ఎత్తి చూపిస్తున్నారు. లాఠీలతో వీపులపై బాదడం, ఇష్టమొచ్చినట్టు జనాలను కొట్టడం, దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొంత నెగెటివిటీ పెరుగుతోంది.

    తప్పును ఎత్తి చూపించిన హీరో..

    తప్పును ఎత్తి చూపించిన హీరో..

    మహిళా డాక్టర్‌ను వేధించిన పోలీసులపై నిఖిల్ ఫైర్ అయ్యాడు. డాక్టర్స్‌ను ముట్టుకోవడానికి పోలీసులకు ఎలాంటి అధికారంగానీ హక్కుగానీ లేదంటూ.. అందులోనూ ఓ మహిళా డాక్టర్‌రు మహిళా పోలీస్ ఆఫీసర్ గానీ మహిళా కానిస్టేబుల్ గానీ లేకుండా చేయకూడని పేర్కొన్నాడు. కర్ఫ్యూను విధించండి.. కానీ వాటిని న్యాయం, చట్టం అనే హద్దులు దాటి చేయకండని సూచించాడు.

    Recommended Video

    Nikhil Siddharth About His Honeymoon

    తాజాగా మరో వీడియో..


    ఏపీలో ఎస్సై ఓ యువకుడిని దారుణంగా కొట్టిన వీడియో తెగ వైరల్ అయింది. దీనిపై నిఖిల్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. ఆ వీడియో బాగా వైరల్ కావడంతో ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు. దీంతో నెటిజన్స్ నిఖిల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే కొందరు మాత్రం నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. వాటిపై కౌంటర్ వేస్తూ.. ఏది ఏమైనా.. ఓ వ్యక్తిని అంత దారుణంగా కొట్టడం తప్పంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Nikhil Siddharth Fires On Police To Beat A Man In curfew. He Request The Government To Tke Action Against Him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X