మాజీ సీఎం కుమారుడి పెళ్లిపై వార్తలు.. దయచేసి అలా చేయకండని ఖండించిన హీరో

నిఖిల్ గౌడ అంటే వెంటనే ఎవరికీ తట్టకపోవచ్చు. అయితే కర్ణాటక మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అదీ కాదంటారా..? జాగ్వార్ సినిమా టైటిల్‌ను తలుచుకోగానే ప్రత్యక్షమవుతాడు. ఎందుకుంటే ఆ సినిమా అంతటి డిజాస్టర్‌గా మిగిలింది కాబట్టి.

ఎన్నికల్లో ఓటమి..

ఎన్నికల్లో ఓటమి..

ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సుమలత మీద ఎంపీగా పోటీ చేశాడు. అయితే ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే అయినా.. స్వర్గీయ అంబరీష్ క్రేజ్ ముందు నిఖిల్ తట్టుకోలేకపోయాడు. ఆయన మరణంతో.. సుమలతకు సింపతీ ఓట్లు బాగానే పడ్డాయి. దీంతో రాజకీయాల్లోనూ నిఖిల్‌కు చుక్కెదురైంది.

నిఖిల్‌పై విమర్శలు..

నిఖిల్‌పై విమర్శలు..

ఓ వైపు రాజకీయాలలో ఉంటూ తండ్రికి చేదోడుగా నిలుస్తున్న నిఖిల్ మరో వైపు సినిమా హీరోగా కూడా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషలలో జాగ్వార్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కానీ.. ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పోనీ రాజకీయాల్లోనూ ఏదైన సాధించాడా? అంటే అది లేదు దీంతో అతనిపై విమర్శల దాడి ఎక్కువైంది.

మళ్లీ సినిమాల వైపు..

మళ్లీ సినిమాల వైపు..

రాజకీయాల్లో ఓటమితో మళ్లీ సినీ పరిశ్రమ వైపు దృష్టి సారించాడు. ఆ మధ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కురుక్షేత్ర మూవీలో అభిమాన్యుడు పాత్రలో నిఖిల్ గౌడ నటించాడు. అయితే ఈ చిత్రం వచ్చింది పోయింది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలీదు. ఇక నిఖిల్ మాత్రం ఎలా గుర్తుంటాడు.

పెళ్లి తేదీపై పుకారు..

పెళ్లి తేదీపై పుకారు..


అయితే నిఖిల్‌కు మాజీ మంత్రి చెన్నప్ప మనవారితో నిశ్చితార్థం జరిగింది. అయితే బెంగళూరులో ఈ వేడుకలను సాధారణంగా జరిపించేశారు. అయితే పెళ్లి తేదీలపై రోజుకో పుకారు వస్తుండటంతో లాభం లేదని స్వయంగా ఖండించాడు. ఇంకా తేదీ ఫిక్స్ చేయలేదని, ఒకవేళ ఫిక్స్ అయితే తానే వెల్లడిస్తానని, ఇలా తప్పు తప్పుగా ప్రచారం చేయకండని కాస్త సీరియస్ అయ్యాడు. ఈ హీరో ప్రస్తుతం కన్నడ, తెలుగులో ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు.

Recommended Video

Finally Boyapati Srinu Gets Cash-Rich Hero || Filmibeat Telugu
ఆమెతో అంతగా ఇంట్రాక్షన్ లేదు..

ఆమెతో అంతగా ఇంట్రాక్షన్ లేదు..


‘మా తల్లిదండ్రులు ఆమెను సెలెక్ట్ చేశారు.. ఆమెతో నేను అంతగా ఇంట్రాక్షన్ కూడా కాలేదు. మీరు ఆమెకు కాస్త ప్రశాంతతనివ్వండి. నా మీద ఎలాగో క్రిటిసిజమ్, కామెంట్స్ చేస్తారు.. కానీ ఆమె అమాయకురాలు..ఇలాంటి వార్తలు ఆమెను బాధిస్తాయి దయచేసి అర్థం చేసుకోండ'ని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X