హీరో నిఖిల్ కొత్త చిత్రం ‘శ్వాస’ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా కొత్త 'స్వాస' అనే కొత్త సినిమా అన్నపూర్ణా స్థూడియోలో ప్రారంభం అయింది. నిఖిల్ సరరసన నివేదా థామస్ హీరోయిన్. శ్రీ తేజ్ ఫిలిం ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై తెరకెక్కబోతున్న ఈ చిత్రం ద్వారా కిషన్ కట్టా అనే యంగ్ డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. తేజు ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి నిర్మాతలు.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరైన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. జెమిని కిరణ్, నరేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. క్రిష్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ సినిమా కథ నాకు ఎంతో నచ్చింది. క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేయడానికి ఇష్టపడతాను. నిర్మాతలు కొత్తవారు. మంచి సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నంలో నేను చేస్తున్న మరో ప్రయత్నమిదని తెలిపారు.
నిఖిల్, నివేదా థామస్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరిణికేష్, సినిమాటోగ్రఫీ: ఇస్తావన్ లెట్టాంగ్, ఆర్ట్: శివ.కె, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, స్క్రిప్ట్ కో ఆర్టినేటర్: వంశీ.బి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బడ్డిరెడ్డి ఆంజనేయులు, కోడైరెక్టర్: శ‌్రీనివాసరావు పిన్నమనేని, నిర్మాతలు: తేజు ఉప్పలపాటి, హరిణి కేష్ రెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిషేన్ కట్టా.


Click it and Unblock the Notifications











