నిఖిల్ మూవీ అప్‌డేట్.. సుకుమార్ కథతో.. రిపీట్ కానున్న మ్యాజిక్
సుకుమార్ కథ అందిస్తే ఎలా ఉంటుందో.. కుమారి 21ఎఫ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కథలను అందంగా తీర్చి దిద్దడంలోనూ, కడుపునిండా వడ్డించడంలో సుకుమార్ చేయి తిరిగిన వాడు. ప్రేక్షకుల మెదళ్లకు అందని లాజిక్స్‌తో తీయడమే కాదు.. మనసును హత్తుకునే భావాలను సైతం అంతే అందంగా తెరపై చూపించగలడు సుకుమార్. ఆయన అందించిన కథలో యంగ్ హీరో నిఖిల్ కనిపించబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఫుల్ ఫామ్‌లో ఉన్న నిఖిల్..
వాయిదాలు పడుతూ వచ్చిన అర్జున్ సురవరం.. ఎట్టకేలకు విడుదలై ఘన విజయం సాధించడంతో నిఖిల్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అంతేకాకుండా ఈ ఏడాదే ఓ ఇంటి వాడు కూడా కాబోతోన్నాడు. తాజాగా తనకు కాబోయో భార్య (డాక్టర్ పల్లవి)ను అందరికీ పరిచయం చేశాడు.

డబుల్ ధమాకా..
అటు సినీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉంది.. ఇటు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా జరగబోతోంది. ఇలా నిఖిల్‌కు డబుల్ ధమాకా దక్కినట్టైంది. అయితే నిఖిల్‌కు ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కార్తికేయ సీక్వెల్‌కు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.
ఆసక్తిరేకెత్తించిన కాన్సెప్ట్ వీడియో..
కార్తికేయ 2 మూవీ ఎలా ఉండబోతోంది.. ఏ కథకు సంబంధించిన్న విషయాన్ని తెలుపుతూ ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో స్టోరీ లైన్ చెప్పి అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ద్వారక నేపథ్యంలో ఈ కథ ఉండోబోతోందని తెలుస్తోంది. అయితే తాజాగామరో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా చేసేశారు.

సుకుమార్ కథతో..
సుకుమార్ అందించిన కథతో కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటించబోతోన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మరో కొత్త కాన్సెప్ట్‌తో కూడుకున్న ప్రేమకథ అంటూ.. ముహుర్తం షాట్ రేపు (మార్చి 5) ఉదయం 9 గంటలకు అంటూ అలాగే అదే సమయానికి టైటిల్ కూడా ప్రకటిస్తామని పోస్ట్ చేశాడు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ కుమారి 21ఎఫ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











