‘అర్జున్ సురవరం’ ఆగిపోయింది... చివరి నిమిషంలో నిఖిల్‌కు షాకిచ్చిన నిర్మాతలు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'అర్జున్ సురవరం' మే 1న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. నిఖిల్ సైతం కొన్ని రోజులుగా సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వారంలో రిలీజ్ ఉందనగా నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. మరోసారి రిలీజ్ డేట్ వాయిదా వేసి షాకిచ్చారు.

వాస్తవానికి ఈ చిత్రం 2018లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. వివిధ కారణాలు, వివాదాలతో వాయిదాల మీద వాయిదా పడింది. అన్నింటినీ దాటుకుని మే 1న విడుదలకు సిద్ధమైంది. గురువారం(ఏప్రిల్ 25) ఉదయం ట్రైలర్ లాంచ్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విషయమై బుధవారం నిఖిల్ ట్విట్టర్ ద్వారా ప్రకటన కూడా చేశారు.

అయితే రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఈవారం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' విడుదలవుతోంది. హాలిడే సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం విడుదల కాబోయే 'అర్జున్ సురవరం' చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించే పరిస్థితి లేక పోవడంతో రిలీజ్ వాయిదా వేయక తప్పలేదట.

Nikhils Arjun Suravaram not releasing on 1st May

అయితే 'అర్జున్ సురవరం' న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఖరారు కాలేదు. త్వరలోనే చిత్ర బృందం ఈ విషయమై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సడెన్ డెసిషన్ వల్ల నిఖిల్ ఇన్ని రోజులు చేసిన ప్రమోషన్స్ వేస్ట్ అయినట్లు అయింది.

నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బి మ‌ధు సమర్పణలో ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X