హీరో నిఖిల్ ‘ముద్ర’ వేయడానికి డేట్ ఫిక్స్ అయింది
నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ముద్ర' విడుదలకు రంగం సిద్ధమైంది. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు.
రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా జర్నలిజం కాన్సెప్టుతో 'ముద్ర' కథ సాగుతుంది. సమాజంలో సమస్యల పరిష్కారం విషయంలో మీడియా తీసుకుంటున్న బాధ్యతను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరిదశలో ఉంది. నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం ఇది. అర్జున్ సురవరం అనే పాత్రికేయుడి పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర నటిస్తున్నారు.
సాంకేతిన నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: టిఎన్ సంతోష్
సమర్పకుడు: బి మధు
నిర్మాతలు: కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్
నిర్మాణ సంస్థలు: ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్రఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
క్యాస్ట్యూమ్ డిజైనర్: రాగా రెడ్డి
డైరెక్షన్ డిపార్ట్ మెంట్: రమా రమేష్, రంగనాథ్, లోకేష్, భరత్, అరు, బ్రహ్మ
పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను


Click it and Unblock the Notifications











