ఇంకా చాలా చాలా నచ్చేస్తున్నారు.. మెగాస్టార్‌పై నిఖిల్ ట్వీట్
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాడు అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరు గురించి మాట్లాడుతూ ఎంతగా ఎమోషనల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిఖిల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తనకు ఈ సినిమా ఆడకపోయినా పర్లేదు మెగాస్టార్ గెస్ట్‌గా వచ్చారు అది చాలని పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు.
కరోనా లాంటి కష్టకాలంలో నిఖిల్ సిద్దార్థ్ తనకు చేతనైనా సాయాన్ని చేస్తూ వస్తున్నాడు. డాక్టర్లకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి కిట్లు అందజేస్తూ వారి బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు. కరోనా పోరులో తన వంతు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇక చిరు చేసే ప్రతీ ట్వీట్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సోసల్ మీడియాలో చిరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిఖిల్ ఫాలో అవుతూనే ఉన్నాడు.

తాజాగా చిరంజీవి షేర్ చేసిన వీడియోపై కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఇంటి పనులు చేసిన వీడియోను షేర్ చేశాడు. అమ్మ కోసం ప్రేమగా దోశలు వేసి ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన నిఖిల్.. 'ఎంతో మంచి హృదయం ఉన్నవాడు మెగాస్టార్.. ఆయన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇంకా చాలా చాలా నచ్చేస్తున్నార'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











